మెగా బ్రదర్ నాగబాబు కొత్త టాలెంట్ ను వెలుగులోకి తీసుకురావడానికి ‘ఖుషీ ఖుషీగా‘ అనే స్టాండప్ కామెడీ షోను తన సొంత యూట్యూబ్ ఛానెల్లో నిర్వహిస్తున్నారు. ప్రతిభ ఉన్నవారు ఒక ఐదు నిముషాలు కామెడీ చేసిన వీడియోలు తనకు పంపాలని గతంలో నాగబాబు పిలుపునిచ్చారు. ఆయనకు అందిన వీడియోలు చూసి అందులో నుండి కొంతమందిని ఎంపిక చేశారు నాగబాబు. సెలక్ట్ అయిన వారితో గతవారం ఒక ప్రోమోను వదిలారు. ఈ ప్రోమోలో కంటెస్టెంట్లంతా డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో రెచ్చిపోయారు.
ప్రోమో చూసిన కొంతమంది నెటిజన్లు ‘ఖుషీ ఖుషీగా’ అనేది స్టాండప్ కామెడీ షో కాదని అదొక బూతు షో అని కామెంట్స్ చేశారు. నెటిజన్ల కామెంట్స్ చుసిన నాగబాబు తనదైన శైలిలో స్పందించారు. ‘ఖుషీ ఖుషీగా’ ప్రోమో చూసిన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు నాగబాబు. ప్రోమోకు అనుకున్న దానికంటే మంచి రెస్పాన్స్ వచ్చిందని అన్నారు. దీనిపై కొంతమంది నెటిజన్లు మాత్రం నెగిటివ్ గా కామెంట్ చేశారని, అలాంటి వారి కోసం పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు.
Must Read ;- తన భార్య పద్మజ గురించి చెపుతూ ఎమోషనల్ అయిన నాగబాబు
ప్రపంచం ముందుకు వెళ్తుంటే కొంతమంది సన్నాసులు ఇలాంటి మాటలే మాట్లాడుతారని, హిందీ, తమిళ్ లో స్టాండప్ కామెడీకి మంచి ఆదరణ ఉందని, అందుకనే మన తెలుగు ప్రేక్షకులకు కూడా ఆ కామెడీని పరిచయం చేయాలని, మంచి టాలెంట్ ఉన్న కమెడియన్స్ ని టాలీవుడ్ కు పరిచయం చేయాలనే ఉద్దేశంతోనే ‘ఖుషీ ఖుషీగా’ షో ను స్టార్ట్ చేశాను అని అన్నారు నాగబాబు.
స్టాండప్ కామెడీ అంటే రోజు మీరు చూసే ‘జబర్దస్త్’, ‘అదిరింది’ వంటి కామెడీ కాదని అన్నారు. ఒక వ్యక్తి తన జీవితంలో జరిగిన అనుభవాలను జోడిస్తూ చేసే కామెడీ ఇదని, అయితే కొన్నిసార్లు వారు పెరిగిన వాతావరణం కారణంగా బూతులు రావొచ్చని అన్నారు. ఈ స్టాండప్ కామెడీని 18సంవత్సరాల నుండి 40 సంవత్సరాలు వయసున్న వ్యక్తుల కోసం రూపొందిస్తున్నామని, పైగా యూట్యూబ్ లో నిర్వహిస్తున్నాం కాబట్టి మా షోను చూడాలా వద్దా అని అనేది మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుందని తెలిపారు నాగబాబు.
కొంతమంది మేధావులు, మహానుభావులు, పవిత్రమైన వ్యక్తులు ఈ షోను చేయకూడని చాలా ఇబ్బందిగా ఉంటుందని అన్నారని, వారందరికి ఒకటే చెప్తున్న మనకు చాగంటి చాగంటి కోటేశ్వర రావు, చినజీయర్ స్వామి, గరికపాటి నరసింహారావు లాంటి ఎందరో గొప్ప వ్యక్తులు ఉన్నారని, వారు మంచి ప్రవచనాలు చెబుతుంటాని, ఎవరైతే నా షో చూసి బాగా ఫీల్ అవుతున్నారో వారు ‘ఖుషీ ఖుషీగా’ షో ను చూడడం మానేసి, భక్తి ప్రవచనాలు చూడండి అని ఘాటుగా స్పందించారు నాగబాబు.
Also Read ;- కుటుంబసభ్యులకు, అభిమానులకు కృతఙ్ఞతలు చెప్పిన నవ వధువు నిహారిక