ఏదో సినిమాలోని ‘అన్నా నడిచొస్తే మాస్.. అన్న లుక్కేస్తే మాస్..’ అన్న పాటను అక్షరాలా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అన్వయించుకోవచ్చు. మొన్న అన్నయ్య నాగబాబు పెళ్లి లో పవన్ కళ్యాణ్ ఎక్కడ ? అని అనేక కళ్లు ఎదురుచూశాయి. ఆ తర్వాత ఓ పొడుగాటి కుర్రాడు కనిపించాడు. ఆ కుర్రాడు పవన్ కళ్యాణ్ పెద్ద కుమారుడు అకీరా నందన్ అని తెలిసే సరికి అందరిలోనూ ఇంకా ఆసక్తి నెలకొంది. అబ్బో ఈ కుర్రాడు బాగా ఎదిగాడే.. హీరో ఎప్పుడవుతాడో అని అందరూ అనుకున్నారు. నిజానికి ఆ ఫొటో అందరినీ ఆకర్షించింది.
అకీరా సోదరి ఆద్య కూడా ఈ పెళ్లికి హాజరైంది. పవన్ కళ్యాణ్ కూ, రేణూ దేశాయ్ కూ పుట్టిన పిల్లలు వీరు. అంతవరకు బాగానే ఉంది.. మరి భార్య అన్నా లెజినోవా ఎక్కడ? అనే ప్రశ్న అందరిలోనూ ఉదయించింది. నిజానికి ఈ పెళ్లికి ఆమె హాజరు కాలేదు. ఆమె ఈ వివాహానికి రాకపోవడం కూడా పెద్ద వార్త అయి కూర్చుంది. ఆమె రష్యా వెళ్లడం వల్ల రాలేకపోయినట్టు సమాచారం. ప్రతి డిసెంబరులోనూ ఆమె రష్యా వెళతారని అంటుంటారు. ఏటా క్రిస్మస్ సమయంలో ఆమె రష్యాలోనే ఉంటారు.
Must Read ;- పవర్ వారసుడు అకిరా ఎంట్రీ భాద్యత ఈ ఇద్దరు టాప్ ప్రొడ్యూసర్స్ దేనా?
అన్నా లెజినోవాతో ఎలా పరిచయం?
అన్నా లెజినోవాతో పవన్ కళ్యాణ్ కు తీన్ మార్ షూటింగు సమయంలో అని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ అది నిజం కాదు. ప్రముఖ నిర్మాత కొండా కృష్ణంరాజు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ఏసుక్రీస్తు జీవితంపై ఓ సినిమా ప్రారంభించారు. ఈ సినిమా షూటింగ్ కొంత ఇటలీలో కూడా జరిగింది. ఈ సినిమాకి కాస్ట్యూమ్ డిజైనర్ గా అన్నా లెజినోవా పనిచేశారట. అలా పవన్ కళ్యాణ్ తో ఏర్పడిన పరిచయం ‘తీన్ మార్’ వరకూ కొనసాగింది. ఆ తర్వాత సెప్టెంబరు 30, 2013లో ఎర్రగడ్డలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వీరి పెళ్లి జరిగింది. నిహారిక పెళ్లిలో అన్నా లెజినోవా కనిపించకుండా రేణు దేశాయ్ పిల్లలు కనిపించడంతో అందరి కళ్లూ అన్నా లెజినోవా కోసం వెతికాయి.
పిల్లల విషయంలో కన్ఫ్యూజన్?
పవన్ కళ్యాణ్ కు ఉన్న పిల్లల విషయంలోనూ కొంత గందరగోళం ఉంది. మొత్తం ఎంతమంది పిల్లలు? వారి పేర్లేమిటి? అని జనం ఎక్కువగా వెతుకుతుంటారు. పవన్ రెండో భార్య రేణు దేశాయ్ కు పుట్టిన సంతానమే అకీరా నందన్, ఆద్య. ఇక పవన్, అన్నా లెజినోవాలకు కూడా మరో ఇద్దరు సంతానం ఉన్నారు. వీరికి కూడా ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడి పేరు మార్క్ శంకర్ పవనోవిచ్, కుమార్తె పేరు పోలేనా అంజనా పవనోవా. ఈ పిల్లలు రష్యాలో బాప్టిజం తీసుకున్నారని కూడా చెబుతుంటారు. పవన్ కళ్యాణ్ కు ఇంత క్రేజ్ ఉన్నప్పుడు ఆయన వారసుల విషయంలోనూ అలాంటి క్రేజ్ ఉంటుంది. పవన్ పిల్లల విషయంలో ఇప్పుడు ఓ స్పష్టత వచ్చి ఉంటుంది.
Also Read ;- ఇన్ స్టాలో గ్రాముల కొద్దీ ‘రేణు’ గానామృతం