నాగచైతన్య, సమంత విడిపోవడం ఎంతటి సంచలనం అయ్యిందో తెలిసిందే. ఇప్పటికీ ఈ వార్తను కొంత మంది నమ్మలేకపోతున్నారు. అయితే… విడాకులు తర్వాత సమంత తనదైన శైలిలో స్పందించింది కానీ.. నాగచైతన్య మాత్రం ఎప్పటిలా సైలెంట్ గా ఉన్నారు. నాగార్జున మాత్రం నాగచైతన్య, సమంత విడాకుల గురించి స్పందించడానికి ఆసక్తి చూపించ లేదు. అయితే.. బంగార్రాజు సినిమా సక్సస్ ను పురస్కరించుకుని నాగార్జున బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్ వ్యూలో నాగచైతన్య, సమంత విడాకులు గురించి స్పందించారని ఈరోజు వార్తలు వచ్చాయి.
ఇందులో నాగార్జున ఏమన్నారంటే.. సమంతే ముందుగా విడాకులకు అప్లై చేసింది. నాగచైతన్య ఆమె నిర్ణయానికి విలువ ఇచ్చాడు. ఇద్దరూ కలిసి విడాకులు తీసుకున్నారు. 2021 న్యూయర్ ను కూడా వాళ్లిద్దరూ కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఇంతలో ఏమైందో ఏమో నాకు తెలియడం లేదు. వాళ్లిద్దరి మధ్య విడిపోయేంత పెద్ద సమస్యలు కూడా ఏమీ లేవు అని నాగార్జున చెప్పారని ఈరోజు సోషల్ మీడియాలోను, ఎలక్ట్రానికి మీడియాలోను వార్తలు వచ్చాయి.
ఈ వార్తలు చూసి అంతా నిజమే అనుకున్నారు. అయితే.. నాగార్జున ట్విట్టర్ లో స్పందిస్తూ.. ఈరోజు నేను చెప్పినట్టుగా నాగచైతన్య, సమంత గురించి వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు. ఏంటీ నాన్ సెన్స్.. వార్తలు ఇచ్చేముందు తెలుసుకుని ఇవ్వండి. రూమర్స్ ని ప్రచారం చేయద్దు అని స్పందించారు. అదీ.. సంగతి.











