కాణిపాకంలో దుండగుల ఘాతుకం.. స్వామి వారి రథ చక్రాలకు నిప్పు!
ప్రముఖ పుణ్య క్షేత్రమైన కాణిపాకంలో దారుణం చోటు చేసుకుంది. స్వామివారి పాత రథ చక్రాలకు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. దీంతో రథ చక్రాలు అగ్నికి ఆహుతయ్యాయి. గోశాల పక్కన నిల్వ ఉంచిన పాత రథ చక్రాలకు నిప్పంటించి, దగ్థం చేశారు. ఇది గుర్తు తెలియని వ్యక్తులు చేసిన పనా? లేక కావాలని ఎవరైనా చేశారా? అన్న అనుమానాలను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. అర్థరాత్రి జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, విచారణ చేపట్టారు. ఆలయం పరిథిలో ఉన్నసీసీ కెమెరా ఫుటేజ్ లను సేకరించి, వాటి ఆధారంగా వివరాలను సేకరించే పనిలో ఆలయ అధికారులు నిమగ్నమయ్యారు.
అంతర్వేది, రామతీర్థం ఘటనలో చేతులెత్తేసిన ఏపీ పోలీసులు..!
రెండు తెలుగు రాష్ట్రల్లో సంచనం రేపిన అంతర్వేది, రామతీర్థం ఘటనలపై నేటికి విచారణ సాగుతునే ఉంది. ఏపీ వ్యాప్తంగా 65 చోట్ల దేవాలయాలు, దేవాత మూర్తులపై దాడులు జరిగిన విచారణ పేరుతో కేసులను సాగాదీస్తున్నారే తప్ప, ఏ ఒక్క దోషినైనా అరెస్ట్ చేసిన పాపాన పోలేదు అన్నది వాస్తవం. అంతర్వేది రథం దగ్థం కేసును విచారణ లోకల్ పోలీసులతో తేలది కాదని, ఏపీ ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. కానీ నేటికి అది పెద్ద మిస్టరీగానే మిగిలిపోయింది. రామతీర్థంలో రాములోరి శిరస్సును ఖండిస్తే.. బాధ్యత వహించాల్సిన పాలకులు.. దోషులను నేటికి పట్టుకోలేకపోయారు. అలానే బెజవాడ కనక దుర్గమ్మ రథానికి ఉండాల్సిన నాలుగు వెండి సింహల్లో మూడు చోరికి గురికాగా.. నేటికి నిందులు వివరాలు, కేసు పురోగతి అన్నది బహిర్గతం కాలేదు. ఇలా ఏపీలో అనేక ఆలయాల్లోని విగ్రహాలు, రథాలు మతోన్మాదుల చేతుల్లో దాడులకు గురౌతున్నా.. దోషులను పట్టుకుని శిక్షించాల్సిన జగన్ రెడ్డి ప్రభుత్వం ప్రేక్షక పాత్ర పోషించడం కడు శోచనీయం!
Must Read:-‘అవినీతి పరిపాలన అందించగలిగిన ఏకైక నాయకుడు జగన్’..!