మంత్రి నారా లోకేష్ బిజీబిజీగా గడుపుతున్నారు. రెండు రోజుల క్రితం ఆటో డ్రైవర్ల సేవలో అనే సంక్షేమ కార్యక్రమంలో పాల్గొన్న లోకేష్..ఇప్పుడు ముంబైలో ఏపీకి పెట్టుబడుల వేట కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్‌తో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి సంబంధించి లోకేష్ ట్వీట్ చేశారు.
ఈ సమావేశంలో రాష్ట్రంలో టాటా గ్రూప్ పెట్టుబడుల వివరాలు, వాటి స్థితిగతుల గురించి చర్చించామన్నారు లోకేష్. రెన్యూవబుల్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వెహికిల్స్, డేటా సెంటర్ల రంగంలో పెట్టుబడుల గురించి కూడా సమావేశంలో ప్రస్తావన వచ్చిందని చెప్పారు. టాటా గ్రూప్‌తో అనుబంధాన్ని పెంచుకునేందుకు ఏపీ సిద్ధంగా ఉందని, మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు టాటా గ్రూప్‌ను ఆహ్వానిస్తున్నామని చెప్పారు.
ఏపీకి పెట్టుబడులు తీసుకువచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు లోకేష్. ఇందుకోసం ముంబై పర్యటనకు వెళ్లారు లోకేష్. ప్రముఖ పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను స్వయంగా వివరిస్తున్నారు. నారా లోకేష్ ప్రతిపాదనలకు టాటా గ్రూప్ అంగీకరించి..రెన్యూవబుల్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వెహికిల్స్, డేటా సెంటర్ల సెక్టార్లలో పెట్టుబడులకు ముందుకు వస్తే ఆయా రంగాల్లో ఏపీ గేమ్ చేంజర్‌గా మారనుంది.
లోకేష్ శ్రమ, కృషితోపాటు వ్యూహాలు మంచి ఫలితాలను అందిస్తున్నాయి.. వైజాగ్‌ని ఐటీ హబ్‌గా తీర్చిదిద్దడానికి ఆయన తక్కువ ధరతో భూములను కేటాయిస్తున్నారు సాఫ్ట్ వేర్ కంపెనీలకి.. అది ఊహించని ఫలితాలను తీసుకువస్తోంది.. ఇప్పటికే, వైజాగ్ తీరాన కొలువుతీరేందుకు టీసీఎస్, కాగ్నిజెంట్, గూగుల్ డేటా సెంటర్ రెడీ అయ్యాయి.. ఇదే ఊపులో మరికొన్ని కంపెనీలు వైజాగ్‌లో అడుగుపెట్టనున్నాయి.. ఇక, రాయలసీమలోని అనంతపురంకి డిఫెన్స్ కంపెనీలను తీసుకురావడానికి లోకేష్ విపరీతంగా ప్రయత్నిస్తున్నారు.. ఇటు, ఆర్సెలర్ మిట్టల్ కంపెనీ ఉత్తరాంధ్రలో 2 లక్షల కోట్ల రూపాయలను ఇన్వెస్ట్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. త్వరలో వైజాగ్ సాక్షిగా జరగనున్న ఇన్వెస్టర్స్ సదస్సులో ఎన్ని కంపెనీలు ఏపీలో తమ పెట్టుబడులను పెట్టడానికి ముందుకు వస్తాయో ఆసక్తికరంగా మారింది..











