తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ గత కొంతకాలంగా ఎపీ ముఖ్యమంత్రి జగన్ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు దాడులు, హత్యకు గురైనప్పుడు ఒక అడుగు ముందుకు వేసి ఘాటైన పదాలతో ముఖ్యమంత్రికి పదునైన ప్రశ్నలతో ఛాలెంజ్ విసురుతున్నారు. ఆయా సందర్భాలను బట్టి సీఎం జగన్ ను టార్గెట్ చేస్తున్న లోకేశ్.. సమయానుకూలంగానే కాకుండా సందర్భానుసారంగానూ జగన్ పై సెటైరిక్ కామెంట్లు చేస్తున్నారు. తాజాగా జగన్ పై లోకేశ్ సంధించిన కామెంట్లకు కూడా జనం నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
నిర్వాసితుల సభలో
మంగళవారం నాడు నారా లోకేశ్ పోలవరం ముంపు గ్రామాల నిర్వాసితుల సమస్యలు తెలుసుకోవడానికి తూర్పుగోదావరి జిల్లా కూనవరం మండలం టేకులబోరు గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ముందుగా నిర్వాసితులు ఎదుర్కొంటున్న సమస్యలను సావధానంగా విన్నారు. అనంతరం నారా లోకేశ్ మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రతి సోమవారాన్ని పోలవారంగా మార్చి పోలవరం ప్రాజెక్టు ను 72% పూర్తి చేస్తే…ఈ “మంగళవారం ముఖ్యమంత్రి” అంటూ అర్థమైందా అని నిర్వాసితులని అడిగి మళ్ళీ మంగళవారం ముఖ్యమంత్రి రెండు సార్లు పోలవరం మాత్రమే వచ్చి నిర్వాసితులను కనీసం కలవలేదు అంటూ దెప్పి పొడిచారు. అలాగే జగన్ ను ఉద్దేశించి గాలిగాడు గాలిలో వచ్చాడు. గాలిలోనే పోతాడాడు అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. ఆయన ప్రసంగం అంతటిలోను సందర్భాన్ని బట్టీ పలుమార్లు గాలిగాడు, గాలిగాడు అంటూ జగన్ ను ఉద్దేశిస్తూ సంచలన కామెంట్లు చేశారు.
టీడీపీ శ్రేణులపై దాడులే కారణం
మంగళవారం గాడు అనే పదం ముఖ్యమంత్రికి కంపేర్ చేసి వాడడం, గాలిగాడు అంటూ పదే పదే జగన్ ఉద్దేశిస్తూ లోకేశ్ మాట్లాడుతున్నప్పుడు సభలో ప్రజల నుండి పెద్ద ఎత్తున్న రెస్పాన్స్ వచ్చింది. లోకేశ్ వాలకం చూస్తుంటే టీడీపీ నాయకులు, కార్యకర్తలపై జగన్ అండ్ కో చేస్తున్న కక్షసాధింపులకు లోకేశ్ చాలా కసిగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఏది ఏమైనా ఇలాంటి పదాలు లోకేశ్ ఉపయోగించడం చూస్తుంటే లోకేశ్ మాంచి స్పీడు మీద ఉన్నట్లు తెలుస్తుంది.
Must Read ;- లోకేశ్ మార్కు!.. దేవుడి వద్ద రాజకీయాలా?











