Nara Lokesh In Top Gear :
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విదేశాలలో విద్య అభ్యసించి, ప్రపంచ బ్యాంకు లో ఉద్యోగం చేసి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిన విద్యాధికుడు. తెలుగుదేశం పార్టీలోని కార్యకర్తలను ఆదుకునేందుకు కార్యకర్తల సంక్షేమం నిధి ఏర్పాటుతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఓ సమావేశంలో మాట దొర్లిన సందర్భంగా వైసీపీ పార్టీ శ్రేణులు పప్పు అంటూ ఆయన ఇమేజ్ ను తగ్గించేలా ప్రచారం చేశాయి. ఆ తరువాతి కాలంలో టీడీపీ తరపున ఎమ్మెల్సీ గా ఎన్నిక అవడం.. ఐటీ, పంచాయితీ రాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టం.. పాలనలో అనేక అవార్డులను ఆయన సొంతం చేసుకోవడం తెలిసిందే. 2019 లో ఎన్నికలో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం, మంగళగిరి నుండి లోకేశ్ కూడా ఓడిపోవడం తెలిసిందే. అయితే గెలుపు ఓటములు అన్న తేడాను పక్కనపెట్టేసిన లోకేశ్.. ఇప్పుడు తనదైన శైలిలో టాప్ గేర్ లోకి వచ్చి వైసీపీ ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తున్నారు.
శాసనమండలి సభ్యుడిగా..
2019 ఎన్నికల అనంతరం శాసన మండలిలో ప్రతిపక్ష పార్టీ సభ్యుడిగా ఎప్పటికప్పుడు ప్రజాసమస్యలపై లోకేశ్ గట్టిగా గళమెత్తునే ఉన్నారు. జగన్ సర్కారు ప్రతిపాదించిన మూడు రాజధానుల బిల్లును అడ్డుకుని వైసీపీ సర్కారుకు తన సత్తా ఏమిటో చూపారు. ఈ వ్యవహారంలో ఎక్కడ కూడా మాట తూలకుండా.. నిబంధనలను అతిక్రమించకుండా లోకేశ్ వ్యవహారం నడిపిన తీరు రాజకీయ పండితులనే ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పాలి. అసెంబ్లీ పాస్ చేసిన బిల్లును శాసనమండలిలో అడ్డుకుని అమరావతి రాజధానికి కొత్త ఊపిరిలూదిన లోకేశ్.. ఆ తర్వాత కూడా సభలో తనదైన శైలి సత్తాను చాటుతూ.. మండలి సమావేశాలకు మంత్రులు తప్పనిసరిగా హాజయ్యేలా వ్యూహం రచించి సక్సెస్ ఫుల్ గా అమలు చేయగలిగారు. ఇలా అనతి కాలంలోనే చట్టాలు, సభా నియమాలు, నిబంధనలపై అవగాహన పెంచుకుని అధికారంలోని వైసీపీ సర్కారుకు లోకేశ్ చుక్కలు చూపిస్తున్నారనే చెప్పాలి. తాజాగా గడచిన నాలుగైదు నెలల్లో లోకేశ్ స్పీడ్ చూస్తుంటే.. ఆయన టాప్ గేర్ లో వెళుతున్నట్టేనన్న విశ్లేషణలు సాగుతున్నాయి.
ప్రజాక్షేత్రంలో లోకేష్ దూకుడు
అకాల వర్షాలు, నివర్ తుఫాన్ వల్ల దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించేందుకు అనంతపురం, పశ్చిమగోదావరి జిల్లాల పర్యటనలో పూర్తి స్థాయిలో పొలాల్లోకి వెళ్లి పంటలు పరిశీలించి, రైతులతో అతి సన్నిహితంగా మెలగి వారి సమస్యల పట్ల లోకేశ్ గట్టిగానే గళమెత్తారు. పది, ఇంటర్ పరీక్షల రద్దుకై మేధావుల, విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలసి సమావేశాలు నిర్వహించి ప్రభుత్వంపై పోరాటం చేసి మరీ విజయం సాధించారు. ప్రజా సమస్యలపై నిర్మాణాత్మకమైన పోరాటాలు చేస్తూనే మీడియా సమావేశాలలో పదునైన పదజాలంతో ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరు, కర్నూలు జిల్లా పెసరవాయిల్లో రాజకీయ ప్రత్యర్థుల దాడిలో చనిపోయిన తన పార్టీ నాయకుల కుటుంబాలను సందర్శించడం.. ప్రత్యర్ధులపై కేసు నమోదు చేసేవరకు వెళ్ళేది లేదని ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేయడం, పెసరవాయి జంట హత్యల సందర్భంలో జగన్ ను ఉద్దేశిస్తూ “దమ్ము, ధైర్యం ఉంటే కేసు బుక్ చేయి రా” అంటూ ఘాటైన పదాలతో సవాల్ విసిరిన లోకేశ్ తనలోని నిజమైన పొలిటీషియన్ ను బయటకు తెచ్చారనే చెప్పాలి. మొన్న జరిగిన రమ్యశ్రీ సఘంటనపై తన పోరాట పటిమ, ప్రభుత్వానికి డెడ్ లైన్ పెట్టడం, కర్నూలు జిల్లాలో ఎర్రబాడు హత్యాచారం జరిగి ఏడాది పూర్తి అయిన సందర్భంగా ఆ గ్రామానికి వెళ్లి బాధిత కుటుంబానికి భరోసా ఇవ్వడమే కాకుండా.. హత్యాచారం జరిగిన ఏడాదైంది.. ఇంకెప్పుడు నిందితులను పట్టుకుంటారు? అంటూ జగన్ సర్కారును డిఫెన్స్ లోకి నెట్టేయడం.. ఇవన్నీ చూస్తుంటే నారా లోకేష్ టాప్ గేర్ లో పోతున్నారనే విశ్లేషణలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
Must Read ;- నారా లోకేశ్ ను చూస్తుంటే జగన్ కు దడే











