టాలీవుడ్ లో పాన్ ఇండియా సినిమాలతో పాటు ప్రభాస్, అల్లు అర్జున్, మహేశ్ బాబు, విజయదేవరకొండ వంటి స్టార్ హీరోలు హిందీ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉండటంతో బాలీవుడ్ లో కంట్రోల్ చేస్తున్న మాఫియా- టాలీవుడ్ లోకి మెల్లిగా మెల్లిగా ఎంట్రీ ఇస్తోంది.
ఎప్పటి నుంచో ఈ నేషనల్ మాఫీయా సౌత్ ఇండస్ట్రీలో మీద కన్నేసినప్పటికీ టాలీవుడ్ లోకి మాత్రం అంత ఈజీగా రాలేకపోయింది. ఈ మాఫియా రాకతో స్టార్ హీరలతో సినిమాలు చేస్తున్న నిర్మాతలు బాగా నష్టపోతున్నారు. ఎందుకంటే ఈ మాఫియా వారు చాలా తక్కువ రేట్లుకి తెలుగు స్టార్ హీరోల హిందీ నాన్ థియేట్రికల్ రైట్స్, థియేట్రికల్ రైట్స్ థర్డ్ పార్టీ పద్ధతిలో తీసేసుకుంటున్నారు.
ఎవరైనా హిందీ నుంచి డైరెక్ట్ గా తెలుగు సినిమాలు కొనుక్కోవాలని చూసినా, ఈ థర్డ్ పార్టీ పద్ధతిలో ఆ డీల్ లోకి ఈ నేషనల్ మాఫియా ఎంట్రీ ఇచ్చేస్తోంది. మహేశ్ బాబు గత మూడు సినిమాలు హిందీ నాన్ థియేట్రికల్ రైట్స్ ఈ పద్థతిలోనే అమ్ముడయ్యాయి. ఈ మూడు సినిమాలుకి నేషనల్ మాఫియా మహేశ్ నిర్మాతలకి ఇచ్చిన రేటు 45 కోట్లు అయితే వారు వీటి ద్వారా సంపాదించిన లాభమే దాదాపుగా 50 కోట్ల వరకు ఉంది.
200 పర్సెంట్ మార్జిన్ లాభాలతో ఈ నేషనల్ మాఫియా మన తెలుగు సినిమాల్ని అమ్ముకొని సొమ్ము చేసుకుంటోంది. ఎక్కువగా కమర్షియల్ ఎలిమెంట్స్ తో కూడిన సన్నివేశాలు ఉండటంతో తెలుగు సినిమాల్ని హిందీ ఆడియెన్స్ విశేషంగా ఆదరిస్తున్నారు. దీన్నే నేషనల్ మాఫియా క్యాష్ చేసుకుటోంది.











