తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో దగ్ధమైన లక్ష్మీనరసింహస్వామి దేవాలయ రథం తయారీ పూర్తయింది. కోటి పది లక్షల వ్యయంతో రూపొందించిన ఏడంతస్తుల రథం ట్రయల్ రన్‌లో బీసీ సంక్షేమ మంత్రి వేణుగోపాల్ పాల్గొన్నారు. రథాన్ని తాళ్లతో కట్టి కొంత దూరం లాగి చూశారు. నూతన రథానికి అత్యాధునిక హైడ్రాలిక్ బ్రేక్స్ టెక్నాలజీ ఉపయోగించారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, భక్తుల సమక్షంలో ఇవాళ రథాన్ని కొంత దూరం లాగారు. దీంతో రథం ట్రయల్ రన్ విజయవంతమైనట్లయింది.
గత ఏడాది అంతర్వేదిలో ప్రఖ్యాత శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయ రథం దగ్ధం కావడం దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. వైసీపీ ప్రభుత్వంపై పెద్దఎత్తున విమర్శలు రావడంతో వెంటనే రథం తయారీకి ఆదేశించారు. దేవాదాయశాఖ ఆధ్వర్యంలో కోటి పది లక్షల వ్యయంతో 6 నెలల కాలంలోనే అత్యాధునిక హైడ్రాలిక్ బ్రేకులతో రథాన్ని సిద్ధం చేశారు. రథం పనితీరును ఇవాళ పరిశీలించిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాల్, ఇతర అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు.
Also Read: దేవాలయాలపై వరుస దాడులు.. హిందూ సంఘాల తీవ్ర ఆగ్రహం