యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన సంచలన చిత్రం ఆర్ఆర్ఆర్. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మార్చి 25న విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివతో ఓ సినిమా.. బుచ్చిబాబు సానాతో మరో సినిమా చేయనున్నారు. కొరటాల శివతో చేయనున్న సినిమా ఈ నెలలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత బుచ్చిబాబుతో సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడని సమాచారం.
ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఎన్టీఆర్ మహేష్ డైరెక్టర్ తో సినిమా చేయనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇంతకీ మహేష్ డైరెక్టర్ ఎవరంటారా..? సర్కారు వారి పాట సినిమా తెరకెక్కిస్తున్న పరశురామ్. మహేష్ తో తెరకెక్కిస్తున్న సర్కారు వారి పాట షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తో సినిమా చేయనున్నాడని.. ఇది రొమాంటిక్ కామెడీ మూవీ అని వార్తలు వస్తున్నాయి.
త్వరలోనే పరశురామ్.. ఎన్టీఆర్ కు కథ చెప్పనున్నాడని తెలిసింది. అయితే.. ఎన్టీఆర్ కొరటాల శివ, బుచ్చిబాబు సానాల తర్వాత ప్రశాంత్ నీల్ తో సినిమా చేయాల్సివుంది. అందుచేత పరశురామ్ చెప్పిన స్టోరీ ఎన్టీఆర్ కు నచ్చినా… ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లడానికి టైమ్ పట్టచ్చు. మరి.. ఎన్టీఆర్, పరశురామ్ కాంబినేషన్లో మూవీ సెట్ అవుతుందా..? లేదో..? క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.