వైజాగ్ జిల్లా, రోలుగుంట మండలం, కుసర్లపూడి గ్రామంలో టిడిపి తరుపున 6 వ వార్డ్ నంబర్‌లో కోట లక్ష్మి నామినేషన్ దాఖలు చేసింది. దీనిపై ఆగ్రహించిన అధికార పార్టీ లక్ష్మి చేత నామినేషన్ విత్ డ్రా చేయించడానికి పంచాయతీ కార్యదర్శిని రంగంలోకి దింపింది. అభ్యర్ధికి ప్రత్యక్షంగా ఫోన్ చేయకుండా.. కోట లక్ష్మి భర్త, అన్నకి ఫోన్ చేసి.. ‘నీ తమ్ముడు, అతని భార్యని వెంటనే తీసుకెళ్లి విత్ డ్రా చేయించు లేకపోతే కొట్టి కొట్టి చంపేస్తాం’ అంటూ బెదిరించిన ఫోన్ కాల్ డేటా నెట్టింట వైరల్ గా మారింది. ఇది విన్న వారందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. బహిరంగంగానే ఇంతటి బెదిరింపులకు పాల్పడుతుంటే పోలీసులు ఏం చర్యలు తీసుకుంటున్నారుని ప్రశ్నిస్తున్నారు.
తనకేం సంబంధం లేదని అభ్యర్ధి బావ చెప్తున్నా కూడా పంచాయతీ కార్యదర్శి పట్టించుకోకుండా ‘నువ్వు నాటకాడుతున్నావు. మీరంతా ఒక్కటే.. అంతా కలిసే చేస్తున్నారు. వెంటనే నామినేషన్ ఉపసంహించుకోమను.. వాళ్లకేం కావాలన్నా నేనిస్తాను.. విత్ డ్రా చేసుకోకపోతే.. ఎందుకు పనికిరాకుండా చేస్తాను’ అంటూ పరుష పదజాలంతో వారిని నిందిస్తూ ఫోన్‌లోనే నానా హంగామా చేశాడు పంచాయతీ కార్యదర్శి.
Also Read: ముగిసిన తొలిదశ నామినేషన్లు.. శ్రీకాకుళం జిల్లాలో ఘర్షణలు











