ఎమ్మెల్యే తనయుడు వనమా రాఘవా అరెస్ట్..!
అప్పుల బాధతో.. తన కుటుంబంలో నెలకొన్న ఆస్తి వివాదాన్ని తీర్చమని భద్రాద్రి కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు రాఘవ ను సంప్రదించారు బాధిత కుటుంబం! ఈ నేపధ్యంలో మీ సమస్య పరిష్కారం కావాలంటే.. నా కోర్కె తీర్చాలి.. నీ భార్యను తీసుకురా.. అని ఎమ్మెల్యే తనయుడు రాఘవ కోరడంతో బాధితుడు రామకృష్ణ మనస్తాపానికి గురైయ్యారు. దీంతో తనతోపాటు తన భార్య, ఇద్దరు బిడ్డలపై పెట్రోలు పోసి ఆత్మహత్య చేసుకున్నారు. ఎమ్మెల్యే కుమారుడి కామవాంఛకు కుటుంబ బలైందని మీడియా, సోషల్ మీడియా దుమ్మెత్తిపోశాయి. విపక్షాలు కూడా ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు, కుమారుడు రాఘవ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, నిందుతుడి రాఘవ కోసం బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో హైదరాబాద్ లో ఉన్న రాఘవ ను గుర్తించి, అరెస్ట్ చేశారు పోలీసులు. అక్కడ నుంచి కొత్తగూడెంకు తరలించారు. అంతకముందు ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు చట్టానికి, విచారణకు సహకరిస్తానని బహిరంగ లేఖ ద్వారా తెలియజేశారు. అలానే కుమారుడి అరెస్ట్ కు సహకరిస్తానని, పార్టీకి, నియోజకవర్గానికి దూరంగా పెడతానని ఆయన చెప్పారు.
హైకమాండ్ సీరియస్.. !
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యకు గల ప్రధాన కారణాలు, దారితీసిన ఘటనలను టీఆర్ఎస్ అధిష్టానం ఆరా తీసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలతో తాజా పరిస్థితిపై, వనమా రాఘవ వ్యవహారంపై అధికార పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. నేతలతో తాజా పరిస్థితిపై ఎప్పటిప్పుడు నివేదికలను తెప్పించుకుంది. రాఘవ పై కఠిన చర్యలు తీసుకోవాలని సొంత పార్టీవారే ఒత్తిడి తీసుకొచ్చినట్లు సమాచారం. రాజీనామాకు డిమాండ్ పెరుగుతున్న నేపధ్యంలో వనమాను పక్కన పెట్టాలని టీఆర్ఎస్ హైకమాండ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.











