ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన భారీ పాన్ ఇండియా మూవీ పుష్ప. ఈ సినిమా అంచనాలకు మించిన సక్సెస్ సాధించింది. ముఖ్యంగా బాలీవుడ్ లో పుష్ప 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది. దీంతో పుష్ప పార్ట్ 2 పై ఇప్పటి నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ.. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా పుష్ప పార్ట్ 2ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించేందుకు మైత్రీ మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తుంది.
పుష్ప పార్ట్ 1 పూర్తైన తర్వాత బన్నీ మరో సినిమా చేసి ఆతర్వాత పుష్ప 2 చిత్రాన్ని మొదలు పెట్టాలని అనుకున్నారు. బోయపాటి శ్రీను, మురుగుదాస్, కొరటాల శివ.. తదితర దర్శకుల్లో ఎవరో ఒకరితో సినిమా ఉంటుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. మరో వైపు సుకుమార్.. విజయ్ దేవరకొండతో ఓ మూవీ చేయాలి అనుకున్నారు. ఆతర్వాత పుష్ప పార్ట్ 2 చేయాలి అనుకున్నారు.
అయితే… పుష్ప పార్ట్ 1 అంచనాలకు మించి సక్సస్ సాధించడంతో ప్లాన్స్ అన్నీ మారిపోయాయి. అన్నీ పక్కన పెట్టి ముందుగా పుష్ప 2 చిత్రాన్ని చేయాలని ఫిక్స్ అయ్యారు. ఫిబ్రవరి నెలాఖరున లేదా మార్చిలో సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. కరోనా పరిస్థితులును బట్టి షూటింగ్ షెడ్యూల్ ప్లాన్ చేయనున్నారు.
ఇక పుష్ప పార్ట్-2 చిత్రాన్ని 2022 డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ఆలోచిస్తున్నారట. సెంటిమెంట్ గా భావించి పుష్ప పార్ట్ 1 రిలీజ్ చేసిన డిసెంబర్ 17నే పుష్ప పార్ట్ 2 కూడా రిలీజ్ చేయాలి అనుకంటున్నారట. మరి.. సెంటిమెంట్ ఎంత వరకు వర్కవుట్ అవుతుందో..? పుష్ప పార్ట్ 2 ఏ రేంజ్ సక్సస్ సాధిస్తుందో చూడాలి.