సీఐడీ కేసుల్లో అరెస్టై బెయిల్‌పై ఢిల్లీలో ఉన్న వైసీపీ ఎంపీ రఘురామరాజు ఇవాళ కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిశారు.తనకు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో మెరుగైన చికిత్స అందించేలా సహకరించినందుకు ఎంపీ రఘురామరాజు కేంద్ర మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.ఢిల్లీలో రఘురామరాజుకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ అండగా నిలిచారని తెలుస్తోంది.రఘురామరాజు ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలోనే ఆయన కుటుంబ సభ్యులు రాజ్‌నాథ్ సింగ్‌ను కలిశారు.రఘురామరాజుకు మెరుగైన చికిత్స అందించాలని వారు కోరారు. వెంటనే రక్షణ మంత్రి ఎంపీ రఘురామకు మెరుగైన వైద్యం కోసం ఆదేశించారని తెలుస్తోంది.అందుకు కృతజ్ఙతలు తెలియజేసేందుకు రఘురామరాజు రక్షణ మంత్రిని కలిశారని చెబుతున్నా,తనపై పెట్టిన అక్రమ కేసులను ప్రస్తావించే అవకాశం ఉందని తెలుస్తోంది.
మరికొందరిని కలిసే అవకాశం..
ఎంపీ రఘురామరాజు ఇవాళ మరికొంత మంది కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం ఉంది.ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ,హోం మంత్రి అమిత్ షాల అపాయింట్‌మెంట్ కోసం ఎంపీ అభ్యర్థన పెట్టారు.అవకాశం దొరికితే ఇవాళ హోం మంత్రి అమిత్ షాను కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది.











