నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య కరోనా నివారణకు తయారు చేసిన మందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కంట్లో వేసే డ్రాప్స్ మినహా మిగిలిన అన్ని రకాల మందులకు అనుమతి ఇచ్చింది. అయితే ఆనందయ్య మందు తీసుకున్న కోటయ్య చనిపోవడంతో కొందరు సందేహాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎన్ఆర్ఐ రాజ్ బోడా ఆనందయ్య కు అండగా నిలిచాడు. ఆనందయ్య మందును టీవీ9 యాంకర్ రజినీకాంత్ పసరుతో పోల్చడంతో రాజ్ బోడా మండిపడ్డారు.
‘‘గోమూత్రం తాగితే కరోనా తగ్గుతుందని.. పేడ పూసుకుంటే వైరస్ రాదు’’ అని చెప్పే బీజేపీ నాయకుల దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. లక్షలకు లక్షలు ఫీజులు వసూలు చేస్తూ. డెడ్ బాడీలు అప్పగిస్తుంటే మీడయా, ప్రభుత్వం ఏం చేస్తుందని మండిపడ్డారు. ఆయుర్వేదం పేరుతో రాందేవ్ బాబా కోట్లకు పడగెత్తాడని, ఆయనతో పోల్చితే ఆనందయ్య చాలా బెటర్ అని అన్నారు. ఇప్పటికైనా ఆనందయ్య మందును పంపిణీ ప్రజలకు పంపిణీ చేయాలని అన్నారు.











