సంక్షేమం ముసుగులో జనాలను జగన్ మభ్యపెడుతున్నారని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు.రెండేళ్ల జగన్మోహన్‌రెడ్డి పాలనలో రాష్ట్ర ప్రజలు అన్ని విధాలా నష్టపోయారని యనమల విమర్శించారు. రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ప్రత్యేక హోదా రాకపోతే రాష్ట్రానికి పరిశ్రమలు రావని,తీవ్ర నష్టం తప్పదని ప్రతిపక్షంలో ఉండగా తీవ్ర విమర్శలు చేసిన జగన్మోహన్‌రెడ్డి,అధికారంలోకి వచ్చాక ప్రత్యేక హోదాపై ఎందుకు మాట్లాడటం లేదని యనమల ప్రశ్నించారు.25 ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి మరీ ప్రత్యేక హోదా తీసుకువస్తానని చెప్పి, ప్రధాని మోడీ వద్ద సీఎం జగన్ మెడలు వంచాడని యనమల దుయ్యబట్టారు.
పాలన ఎందులో బాగుంది
వైసీపీ ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నిస్తే ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని యనమల విమర్శించారు.బడ్జెట్ కూడా అర్డినెన్స్ ద్వారా తెచ్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అన్నారు.బడ్జెట్‌ను ఆమోదించుకునేందుకు ఒక్క రోజు మాత్రమే సమావేశం పెట్టడాన్నిఆయన తప్పు పట్టారు.బడ్జెట్‌పై ఎలాంటి చర్చ లేకుండానే ఒక్క రోజు సమావేశంలోనే అమోదింపజేసుకున్నారని యనమల గుర్తు చేశారు.రాజ్యాంగ వ్యవస్థలపై కూడా ఏపీ సీఎం తిరుగుబాటు చేస్తున్నారని,కోర్టులన్నా జగన్‌కు గౌరవం లేదన్నారు.33 కేసులు,43 వేల కోట్ల ఆస్తుల ఈడీ అటాచ్‌మెంట్ ఉన్న వ్యక్తి భారత రాజకీయాల్లో జగన్ తప్ప మరొకరు లేరని యనమల విమర్శించారు.











