సుశాంత్ సింగ్ మరణం తర్వాత సినిమా రంగంలో డ్రగ్స్ వ్యవహారం ఎంతలా వేళ్లూనుకుందో బయటపడుతోంది. తాజాగా తెలుగు సినిమా రంగానికీ ఇది విస్తరించేలా ఉంది. ఇదే విషయంలో ఒకప్పుడు జరిగిన దర్యప్తు పెద్ద సంచలనమే అయ్యింది. సుశాంత్ ప్రయురాలు రియా అరెస్టుకు ముందే కన్నడ సినీ రంగంలోనూ అరెస్టులు జరిగాయి. నటలు రాగిణి, సంజన అరెస్టుల తర్వాత రియా అరెస్టు కూడా జరిగింది. డ్రగ్స్ సరఫరా, కొనడం లాంటి వ్యవహారాల్లో మరికొందరు కీలక వ్యక్తుల పేర్లు వెలుగులోకి వస్తున్నాయి.
బాలీవుడ్ హీరోయిన్లు సారా అలీఖాన్, తెలుగు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, డిజైనర్ సైమాన్ ఖంబట్టాల పేర్లు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఎన్సీబీ అధికారులు విచారణ జరిపినప్పుడు రియా నోటి నుంచి మరికొందరి పేర్లు బయటికి వచ్చాయని తెలుస్తోంది. వీటిలో దక్షణాది ప్రముఖుల పేర్లు బయటికి రావడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.

టైమ్స్ నౌ బయటపెట్టిన వారెవరు?
జాతీయ ఛానెల్ టైమ్స్ నౌ ఈ డ్రగ్స్ వ్యవహారంలో ముగ్గురి పేర్లను బయటపెట్టడం ఇప్పుడు పెద్ద సంచలనమైంది. వారే సారా అలీఖాన్, రకుల్ ప్రీత్ సింగ్, సైమాన్ ఖంబట్టా. ఎన్సీబీ విచారణలో రియా నోటి నుంచి మొత్తం 25 మంది బాలీవుడ్ హీరో హీరోయిన్ల పేర్లు బయటికి వచ్చినట్టు వార్తలొచ్చాయి. వారెవరు అనేది కూడా ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది. ఈ డ్రగ్స్ మాఫియాలో అగ్రహీరోలు, హీరోయిన్లు ఉన్నట్లు తెలుస్తోంది. రియా కాల్ డేటాలో రకుల్ ప్రీత్ సింగ్, దగ్గుబాటి రానా పేర్లు ఉన్నట్లు సమాచారం.

ఈ కాల్ డేటా గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోకపోయినా ఇప్పుడు టైమ్స్ నౌ ఆ వివరాలు వెల్లడించి సంచలనానికి తెరతీసింది. మొన్నటికి మొన్న కన్నడ నటి రాగిణి, సంజన వ్యవహారం అరెస్టుల పర్వం దాకా వెళ్లింది. తాజాగా రకుల్ పేరు వెలుగులోకి రావడంతో ఇది ఇంకా ఎన్ని మలుపులు తీసుకుంటుందో అర్థంగావడం లేదు. రకుల్ తో పాటు తెలుగులో ఓ ప్రముఖ నటుడి కుమార్తె పేరు కూడా ఈ వ్యవహారంలో వినిపిస్తోంది.
రచ్చ చేస్తున్న రాగిణి, సంజన
డ్రగ్స్ కేసులో అరెస్టయిన నటి రాగిణి, సంజన లకు ఉచ్చు అంతకంతకూ బిగుసుకుంటోంది. డోప్ టెస్ట్ లకు వీరు వైద్యులకు సహకరించడం లేదట. నటి సంజన తెలుగులో కూడా కొన్ని సినిమాల్లో నటించింది. పోలీసులతో కూడా వీరు వాదనకు దిగుతున్నట్లు సమాచారం. రోజురోజుకూ కొత్త కొత్త పేర్లు తెరపైకి వస్తుండంతో ఇది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది. డ్రగ్స్ కేసులో అరెస్టయిన చాలామందికి కేరళకు చెందిన బంగారం స్మగ్లర్లతో కూడా సంబంధాలు ఉన్నట్లు దర్యప్తులో వెల్లడవుతోంది.











