తమిళ టాలెంటెడ్ హీరో సూర్య నటించిన బయో గ్రాఫికల్ ఎంటర్ టైనర్ సూరారై పోట్రు. తెలుగులో ఈ సినిమా ఆకాశం నీ హద్దురా గా విడుదలైన సంగతి తెలిసిందే. అపర్ణాబాల మురళీ కథానాయికగా నటించిన ఈ సినిమాని టాలెంటెడ్ దర్శకురాలు సుధాకొంగర తెరకెక్కించారు. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అయిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. డెక్కన్ ఎయిర్ వేస్ వ్యవస్థాపకులు గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసల్ని సైతం దక్కించుకుంది.
అలాంటి ఈ సినిమా 93వ ఆస్కార్ పురస్కారాల ఎంట్రీకి ఎంపికైన విషయం తెలిసిందే. అయితే ప్రపంచ వ్యాప్తంగా విదేశీ కేటగిరిలో పోటీ పడుతున్న చిత్రాల లిస్ట్ ను ఫైనల్ చేయగా.. అందులో 366 చిత్రాలు నిలిచాయి. వాటిలో ఆకాశం నీ హద్దురా సినిమా చోటు దక్కించుకుంది. మార్చ్ 15న ఆస్కార్ అవార్డు ల ప్రదానం జరగనుండగా.. ఈ సినిమా విషయంలో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.
Must Read ;- తమిళ స్టార్ హీరోతో బోయపాటి?