మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. వీరిద్దరి కాంబినేషన్లో మూవీ గురించి ఎప్పటి నుంచో వార్తలు వస్తూనే ఉన్నాయి కానీ.. సెట్స్ పైకి వెళ్లడం లేదు. చరణ్ తో సెట్ కాలేదు.. చిరంజీవి, త్రివిక్రమ్ తో అయినా మూవీ సెట్ అవుతుంది అనుకంటే అదీ జరగలేదు. ఆతర్వాత చిరు, పవన్ ల క్రేజీ కాంబినేషన్లో త్రివిక్రమ్ డైరెక్షన్లో మూవీ అని ప్రకటించారు సీనియర్ నిర్మాత, రాజకీయ నాయకుడు సుబ్బిరామిరెడ్డి. ఇది కూడా ప్రకటనలకే పరిమితం అయ్యింది కానీ.. సెట్స్ పైకి వెళ్లలేదు.
తాజా వార్త ఏంటంటే.. చరణ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో మూవీ కన్ ఫర్మ్ అయ్యిందట. ఈ క్రేజీ కాంబినేషన్లో మూవీని సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాత నాగవంశీ ఓ ఇంటర్ వ్యూలో తెలియచేశారు. అయితే.. ఈ మూవీ మహేష్, త్రివిక్రమ్ మూవీ తర్వాత ఉంటుందా..? లేక ఎన్టీఆర్ తో చేయనున్న మూవీ తర్వాత ఉంటుందనేది ఇప్పుడు చెప్పలేను కానీ.. ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా ఉంటుందని చెప్పారు.
దీంతో ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై మరింత ఆసక్తి ఏర్పడింది. ఓ వైపు చరణ్ శంకర్, గౌతమ్ తిన్ననూరిలతో చేయనున్న సినిమాలు పూర్తవ్వాలి. మరో వైపు త్రివిక్రమ్ మహేష్, ఎన్టీఆర్ లతో చేయనున్న సినిమాలు కంప్లీట్ అవ్వాలి. ఆతర్వాత చరణ్, త్రివిక్రమ్ మూవీ సెట్స్ పైకి వస్తుంది. అందుచేత.. ఆలస్యం అయితే అవ్వచ్చు కానీ.. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడం మాత్రం పక్కా అంటున్నారు. ఎప్పుడు అనేది క్లారిటీ రావాలంటే.. కొన్ని రోజులు ఆగాల్సిందే.











