కూర్మన్నపాలెం వద్ద నిరనలు..
విశాఖ స్టీల్‌ప్లాంట్ ను ప్రైవేటీకరిస్తాం, అమ్మేస్తాం అని నిర్ణయాలు తీసుకోవడం, అందుకు తగ్గట్లు ప్రయత్నాలు చేయడం వంటివి కేంద్రం ఇప్పటికైనా మానుకోవాలిని స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ సమితి డిమాండ్ చేస్తుంది. కూర్మన్నపాలెంలో ఉద్యమాన్ని ప్రారంభించి నేటికి 365 రోజులు కావస్తున్న మోదీ ప్రభుత్వం స్పందిచకపోవడం శోచనీయమని వాపోతున్నారు కార్మికులు. ఈ సందర్భంగా ఉద్యమ శిబిరం వద్ద 365 జెండాలతో నిరసన వ్యక్తం చేసిన్నట్లు కార్మిక సంఘాలు తెలిపాయి. ఇప్పటికే వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తూ వచ్చిన పరిరక్షణ సమితి సభ్యులు.. మున్ముందు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
రేపు జైల్‌భరో..
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ.. పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేస్తున్న నిరసనలకు శనివారంతో ఏడాది పూర్తైంది. ఏడాది పాటు వివిధ రూపాల్లో నిరసనలు వ్యక్తం చేస్తున్నప్పటికీ.. కేంద్రం కనీసం పట్టించుకున్న పాపానపోలేదు! ఇందుకు నిరసనగా రేపు (ఆదివారం) జైల్‌భరో కార్యక్రమాన్ని నర్వహించేందుకు కార్మికుల సిద్ధమౌతున్నారు. ఇప్పటికే విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. ఈ నిర్ణయంపై కేంద్రం వెనక్కి తగ్గకుంటే భవిష్యత్తులో మరెన్నో ఉద్యమాలు ఒకస్థాయి ఉద్యమిస్తాయని స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ సమితి సభ్యులు హెచ్చరిస్తున్నారు. కరోనా కష్టకాలంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ద్వారా లక్షల మందికి ప్రాణాలు నిలిపే ప్రాణవాయువు అందిందని నేతలు గుర్తు చేస్తున్నారు. లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధినిచ్చే స్టీల్‌ప్లాంట్ ను అధికారం ఉంది కదా అని అమ్మేయ్యాలని చూస్తే ఊరుకోవడానికి తెలుగు ప్రజలు బానిసలు కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పరిరక్షణ సమితి నేతలు. కేంద్రం నిరంకుశత్వ ఆలోచనలు మానుకోవాలని హితవు పలికారు.











