ఈ ఏడాది ‘భీష్మ’ సినిమాతో సూపర్ హిట్టు సాధించాడు నితిన్. ప్రస్తుతం ‘రంగ్ దే’ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించడం విశేషం. రీసెంట్ గా విడుదలైన ‘రంగ్ దే’ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. గత కొంతకాలంగా కరోనా మహమ్మారి దేశమంతటా వ్యాపించడంతో సినిమా షూటింగ్స్ నిలిపివేసిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు ఇప్పుడు .. సినిమా షూటింగ్స్ కి అనుమతి లభించడంతో ‘రంగ్ దే’ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమైంది.
తాజాగా ఈ సినిమా మరో షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని స్వయంగా హీరో నితిన్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘రంగ్ దే’ సినిమాకు సంబంధించి మరో షెడ్యూల్ ను సేఫ్ గా పూర్తి చేసుకున్నాం’ అని నితిన్ తెలిపాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి చేసి 2021 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారని టాలీవుడ్ టాక్. ‘రంగ్ దే’ సినిమాతో తమ అభిమాన హీరో మరో మంచి హిట్ అందుకోవాలని నితిన్ అభిమానులు కోరుకుంటున్నారు. ‘రంగ్ దే’ సినిమాతో నితిన్ ఏ రేంజ్ లో హిట్ కొడతాడో చూడాలి.
Another schedule of #Rangde completed safe and sound! @pcsreeram @KeerthyOfficial @dirvenky_atluri @vamsi84 @SitharaEnts pic.twitter.com/bzhSNUlZgU
— nithiin (@actor_nithiin) October 6, 2020











