ఈ సంక్రాంతికి విడుదలై బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ గా నిలిచింది బన్ని ‘అలా వైకుంఠపురములో’ సినిమా. రికార్డుల పరంగా ‘బాహుబలి 2’ తరువాత స్థానంలో నిలిచి మరెన్నో కొత్త రికార్డులను నమోదు చేసుకుంది ఈ సినిమా. మలయాళంలో విడుదలైన ఈ సినిమా మొదటి రోజు ముప్పై బెనిఫిట్ షోలు ప్రదర్శింపబడడం కేరళలో మరో రికార్డు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రికార్డు కలెక్షన్స్ తెచ్చుకుంది. ఇక ఈ సినిమా తాజాగా మరో రికార్డును నెలకొల్పింది.
ఈ మూవీకి ప్రధాన బలం సంగీతం. థమన్ అందించిన సంగీతంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ముఖ్యంగా ఈ సినిమాలో ‘రాములో రాములా’ అనే పాట కుర్రకారును ఊపేసింది. అప్పట్లో ఎక్కువ మంది చుసిన పాటగా ఆ పాట నిలిచింది. ప్రస్తుతం ‘బుట్ట బొమ్మ’ సాంగ్ రికార్డులను సృష్టిస్తోంది. తాజాగా ఈ సాంగ్ 400 మిలియన్ వ్యూస్ మార్కును అందుకుంది. హారిక & హాసిని క్రియేషన్స్ సంస్థవారు తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ‘బుట్ట బొమ్మ’ పాట 400 మిలియన్ వ్యూస్ ను అందుకోవడం చాల సంతోషంగా ఉందని వారు తెలిపారు. మరోవైపు అల్లు అర్జున్ ఫాన్స్ ఈ సందర్భంగా తమ ఆనందాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకుంటున్నారు. తమ అభిమాన హీరోకు వారు అభినందనలు తెలుపుతున్నారు.











