మోడలింగ్ తో కెరీర్ ను ప్రారంభించి వెండితెరను షేక్ చేస్తున్న క్రేజీ బ్యూటీ రష్మిక మందన్నా.‘ఛలో’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు ఆ సినిమా హిట్ టాక్ కైవసం చేసుకోవడంతో వరుస ఆఫర్ లతో దూసుకుపోతోంది.ఇండస్ట్రి లో అడుగుపెట్టిన అతి కొద్దికాలంలోనే స్టార్ హీరోల సరసన ఛాన్స్ కొట్టేసి టాప్ హీరోయిన్‌గా ఎదిగింది ఈ కన్నడ ముద్దుగుమ్మ.ఒక్క తెలుగులోనే కాకుండా ఇతర సౌత్ భాషల్లోనూ సినిమాలు చేస్తూ అక్కడ కూడా మంచి గుర్తింపుని సాధించింది.2021లో వచ్చిన పుష్ప మూవీతో ఈ అమ్మడు ఒక్కసారిగా పాన్ ఇండియా రేంజ్ లో పాపులారిటీ వచ్చింది. ఈ క్రేజ్ తోనే ఈ భామ బాలీవుడ్‌లో సినిమాలు చేస్తోంది.
ప్రస్తుతం రష్మిక బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా నటిస్తున్న ‘మిషన్ మజ్ను’సినిమాతో రష్మిక బాలీవుడ్ కి పరిచయం కానుంది.కాగాం ఇప్పటికే బాలీవుడ్ లోనూ రష్మిక క్రేజ్ పెరిగిపోయినట్లుగా కనిపిస్తోంది. హిందీలో తన తొలి చిత్రం ఇంకా విడుదల కాకముందే రష్మిక నటించిన రెండో బాలీవుడ్ సినిమా ‘గుడ్ బై’ షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. ఈ మూవీలో అమితాబ్ బచ్చన్ ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారని సమాచారం. ఈ మూవీ షూటింగ్ పూర్తి కావడంతో రష్మిక సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్‌ను షేర్ చేసింది.ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారుతోంది.
రష్మిక తన పోస్టులో ‘గుడ్ బై. నా బిడ్డ ‘గుడ్ బై’కు ఇది చెప్పాలని లేదని.. కానీ చెప్పాల్సిన సమయం వచ్చేసిందని రాసుకొచ్చింది.రెండేళ్ల క్రితం ప్రారంభమైన ఈ సినిమా జర్నీ కరోనా, ఇతర ప్రతికూలతలతో సాగిందని.. ఎన్ని సమస్యలు ఉన్నా పార్టీ చేసుకోకుండా ఏదీ ఆపలేదని తన పోస్టులో పేర్కొంది. గుడ్ బై ఎలాంటి మ్యాజిక్స్ చేస్తుందో చూడాలని తాను ఎంతో ఆతృతగా ఉన్నానని.. బిగ్గరగా నవ్వడానికి సిద్ధంగా ఉండాలని.. ఈ టీమ్ లో తాను పనిచేసిన ప్రతి ఒక్కరూ తనకు ఎప్పటికీ సూపర్ స్పెషల్‌గా ఉంటారని పేర్కొంది.. త్వరలో మళ్లీ అందరం కలిసి పని చేద్దాం.. ఇది ఎలా జరుగుతుందో నాకు తెలియదు. కానీ చాలా త్వరగా జరుగుతుందని వెల్లడించింది.
అదేసమయంలో అమితాబ్ బచ్చన్ సార్..మీరంటే నాకు చాలా అభిమానం. మీతో ఈ సినిమా చేసినందుకు నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. మీరు ప్రపంచంలోనే అత్యుత్తమ వ్యక్తి!. ఇలాంటి సినిమా కోసం నన్ను నమ్మి, సెలెక్ట్ చేసినందుకు వికాస్ మీకు ధన్యవాదాలు. ఫ్రెండ్స్.. నా బిడ్డ ‘గుడ్‌బై’తో త్వరలో మీ అందరినీ కలుస్తాను..మీరు సిద్ధంగా ఉండండి.. ఇంకా నేను వేచి ఉండలేను’ అని ఎంతో ఎమోషనల్‌గా రాసుకొచ్చింది.
కాగా , రష్మిక ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఆమె అభిమానులు లైక్ లతో ఆమె పోస్టుకు మద్దతు పలుకుతున్నారు.