జగన్ ప్రభుత్వం తీసుకున్న అమరావతి భూముల అమ్మకం , లీజు నిర్ణయం పై అమరావతి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అమరావతిని ఎడారి తోనూ, శ్మశానంతోనూ పొలుస్తూ విషయ ప్రచారం చేసిన వైసీపీ ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు ఆ భూములను ఎలా అమ్ముతారని ప్రశ్నించారు. బ్యాంకుల నుంచి అప్పులు పుట్టే పరిస్థితి లేకనే జగన్ సర్కార్ అమరావతి భూములు అమ్మకానికి పెడుతోందని మండిపడ్డారు. అభివృద్ధి చేస్తారని ప్రజలు జగన్ కి అధికారం కట్టబెడితే, అభివృద్ధి గాలికోడిలేసి రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్ర ప్రదేశ్ గా మార్చారని ధ్వజమెత్తారు.
అమరావతి భూముల అమ్మకంతో పాటు ఇప్పటికే నిర్మించిన టవర్స్‌ను లీజుకు ఇవ్వాలని జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను అమరాతి రైతులు వ్యతిరేకిస్తున్నారు. అభివృద్ధి కోసమే భూములను అమ్మకానికి పెడుతున్నామనేది కేవలం ఒక సాకగానే పరిగణిస్తున్నామని జేఏసీ నేతలు అన్నారు. అధికారంలోకి వచ్చిన మూడేళ్ళలో అమరావతే ఏపీ రాజధాని అని జగన్ ఎక్కడా ప్రకటించలేదని పేర్కొన్నారు. సీఆర్డీయే అధికారులు కూడా అమరావతి రైతులతో చర్చించకుండా నిర్ణయం తీసుకోవడం సరికాదన్న జేఏసీ నేతలు.. రైతులకు న్యాయం చేయకుండా భూములు ఎలా అమ్ముతారని ప్రశ్నించారు.
గత తెలుగుదేశం ప్రభుత్వం అసైన్డు రైతులను ఆదుకునే విధంగా, అమ్మకాలు, కొనుగోలు చేసే విధంగా జీవో తీసుకువచ్చారని.. కానీ జగన్ అధికారంలోకి రాగానే ఆ జీవోను రద్దు చేశారని theleonews.com,latest telugu news,todays news,viral videos,telugu news,andhra pradesh news,telangana news,newsతెలిపారు.మూడేళ్లుగా అమరావతిని కనీసం పట్టించుకోకుండా ఇప్పుడు వచ్చి అభివృద్ధి చేస్తామని చెబితే నమ్మే పరిస్థితి లేదన్నారు. వెంటనే సిఎం జగన్ అమరావతే ఏకైక రాజధాని అని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అలా చేస్తే తాము స్వాగతిస్తామని స్పష్టం చేశారు. అదేవిధంగా అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేస్తామని జగన్ స్పష్టమైన ప్రకటన చేయాలని, రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని జేఏసీ నేతలు ముఖ్యమంత్రి జగన్ ని కోరుతున్నారు.