దర్శకధీరుడు రాజమౌళి క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’ ప్రస్తుతం ఇండియాలోనే మోస్ట్ ఎవైటెడ్ మూవీ. యన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా ప్రీ ఇండిపెండెన్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ కి కరోనా వైరస్ కారణంగా ఏడునెలలు బ్రేక్ పడింది. నిజానికి జూలై నెలలో ఈ సినిమా షూటింగ్ ను తిరిగి ప్రారంభించాలని జక్కన్న ప్రయత్నించాడు . కానీ సాధ్యపడలేదు. లాక్ డౌన్ విధించిన ఏడు నెలల తర్వాత మళ్ళీ ఈ రోజు ఆర్.ఆర్.ఆర్ టీమ్ సెట్స్ లోకి అడుగుపెట్టింది.
హైద్రాబాద్ లోని అల్యూమినియమ్ ఫ్యాక్టరీలో ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. ముందుగా మూడురోజులు టెస్ట్ షూట్ చేస్తారట. ఆ తర్వాత యన్టీఆర్ సెట్స్ లోకి అడుగుపెడతాడని సమాచారం. అలాగే.. అతడిపై ఓ ప్రోమో వీడియో ను షూట్ చేసి.. ఆ తర్వాత సినిమాకి సంబంధించిన కొన్ని ముఖ్య సన్నివేశాల్ని చిత్రీకరిస్తారట. ఈ నెల చివరలో రామ్ చరణ్ ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అవుతాడని తెలుస్తోంది. ఈ సంవత్సారంతంలో కానీ, వచ్చే ఏడాది ప్రారంభంలో కానీ సినిమా షూట్ ను కంప్లీట్ చేసి.. వచ్చే ఏడాది దసరాకానుకగా సినిమాను విడుదల చేయాలన్నది జక్కన్న ప్లానట.











