రాజద్రోహం కేసులో తనను అరెస్టు చేసిన సమయంలో తన వద్ద ఉన్న ఐ ఫోన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారని, దాన్ని ఇంత వరకు రికార్డుల్లో చూపలేదని నరసాపురం ఎంపీ రఘురామరాజు వెల్లడించారు. తన వద్ద స్వాధీనం చేసుకున్న ఐ ఫోన్ వెంటనే ఇవ్వాలంటూ మంగళగిరి సీఐడీ ఏడీజీకు లీగల్ నోటీసులు ఇప్పించారు. తన వద్ద స్వాధీనం చేసుకున్న ఐ ఫోన్లో కుటుంబ వ్యక్తిగత సమాచారం ఉందని, పార్లమెంటు కమిటీల్లో కూడా తాను మెంబరుగా ఉన్నానని, దానికి సంబంధించిన సమాచారం కూడా ఉందని ఆయన గుర్తు చేశారు. పార్లమెంటు విధులకు హాజరు కావాలంటే తన ఫోన్ తిరిగి ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
సివిల్, క్రిమినల్ చర్యలు తప్పవు
తన వద్ద స్వాధీనం చేసుకున్న ఫోన్ తిరిగి ఇవ్వకుంటే సంబంధిత పోలీసు అధికారులపై సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటానని ఎంపీ రఘురామరాజు స్పష్టం చేశారు. తన వద్ద స్వాధీనం చేసుకున్న ఫోన్ వివరాలు కూడా తనపై పెట్టిన కేసు వివరాల రికార్డుల్లో చూపలేదని ఆయన గుర్తు చేశారు.
Must Read ;- ఆ ముగ్గురూ కుట్ర చేశారు : రఘురామరాజు సంచలన ఆరోపణలు!