నాజూకు నడుమొంపుల సోయగాలతో కవ్వించే గోవా కోవా ఇలియానా డీక్రుజ్. కెరీర్ బిగినింగ్ లో టాలీవుడ్ లో ఆమె చేసిన అందాల విన్యాసాలు కుర్రకారును నిద్రకు దూరం చేసేవి. స్టార్ హీరోలు, మీడియం రేంజ్ హీరోలు అనే బేధం లేకుండా.. దాదాపు అందరు స్టార్స్ తోనూ నటించేసిన ఇల్లూ బేబ్ .. ఆ తర్వాత ప్రేమలో పడి కొంతకాలం సినిమాలకు దూరం అయింది.
ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ ఫోటోస్ తో హీటు పుట్టించడం ఇలియానా హాబీ గా పెట్టుకుంది. తర్వాత కొంతకాలం ఇలియానా బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంది. అయితే అక్కడ కూడా అమ్మడికి కాలం కలిసిరాలేదు. ఆపై మళ్ళీ టాలీవుడ్ లో కథానాయికగా ప్రవేశించాలని గట్టి ప్రయత్నమే చేసింది. కానీ అది కూడా వర్కవుట్ కాలేదు. దాంతో ఇప్పుడు ఇలియానా సైడ్ బిజినెస్ మొదలుపెట్టింది.
ఇటీవల తాను తయారు చేసిన చాక్లెట్ కేక్ వీడియో ను ఇన్ స్టాలో పోస్ట్ చేసింది ఇలియానా. సూపర్ టేస్టీ అని సందడి చేస్తూ.. ఇదే తన కెరీర్ ను మలుపు తిప్పబోయేది అంటూ క్లూ కూడా ఇచ్చేసింది. తనకి ఇది ఆల్టర్ నేట్ కెరీర్ అవుతుందని చెప్పకనే చెప్పింది. లాక్ డౌన్ తర్వాత చైన్ రెస్టారెంట్లు, బేకరీలు మొదలు పెట్టే ఆలోచనలో ఇలియానా ఉన్నట్టు తెలుస్తోంది. తనపేరుతోనే వాటిని మార్కెట్ చేసుకోవాలని ఇలియానా ప్లాన్.
ఇలియానాకి ఇప్పటికే డిజైనర్ గార్మెంట్స్ బొటిక్ ఉంది. ముంబై, హైద్రాబాద్ లో వాటికి బ్రాంచెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు వీటికి తోడు .. ఈ కొత్త బిజినెస్ కూడా చేయబోతోంది. లవ్ లైఫ్ ఫెయిల్ అయ్యాకా చాలారోజులు డిప్రెషన్ లోకి వెళ్ళిన ఇలియానా.. ఇప్పుడు ఆ పీడకలను మరిచిపోవడానికి .. తనేంటో నిరూపించుకోవడానికి దీన్నో అవకాశంగా తీసుకోనుంది. మరి ఇలియానా ఇకపై ఆ బిజినెస్ తో ఏ రేంజ్ లో బిజీ అవుతుందో చూడాలి.
Must Read ;- మహేశ్ బ్యూటీ మళ్ళీ టాలీవుడ్ లోకి వస్తోందట!