తిరుమలలో మరో భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే కల్తీ నెయ్యి, పరకామణి చోరీ అంశం సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే. ఐతే తాజాగా మరో స్కామ్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. శ్రీవారి దర్శనానికి వచ్చే ప్రముఖులు, విరాళాలు ఇచ్చే దాతలు, వేద ఆశీర్వచనం పొందే వారికి సాంప్రదాయబద్ధంగా అందజేసే పట్టు సారిగ దుపట్టాలకొనుగోలులో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు తేలింది. గత కొన్నేళ్లుగా స్వచ్ఛమైన పట్టుకు బదులుగా నకిలీ వస్త్రాలను సరఫరా చేసి TTD ఖజానాకు గండి కొట్టినట్లు తెలుస్తోంది.
ఈ వ్యవహారంపై టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు నేతృత్వంలోని ధర్మకర్తల మండలి ఆగ్రహం వ్యక్తం చేసింది. విజిలెన్స్ విచారణలో టెండర్ నిబంధనల ఉల్లంఘన, నకిలీ పట్టు సరఫరా జరిగిందని నిర్ధారణ అయింది. దీంతో టీటీడీ తదుపరి సమగ్ర దర్యాప్తు కోసం ACBని సంప్రదించిందని సమాచారం.
గడిచిన 10 ఏళ్లుగా TTDకి ఒకే సంస్థ పట్టు వస్త్రాలను సరఫరా చేస్తోంది. రూ. 100 కూడా విలువ చేయని పట్టు వస్త్రాలను..రూ.1400 వందలకు టెండర్‌దారుడు సరఫరా చేసినట్లు విజిలెన్స్ విచారణలో గుర్తించారు. పట్టు వస్త్రాలకు బదులుగా నాణ్యత లేని పాలిస్టర్ వస్త్రాన్ని VSR ఎక్స్‌పోర్ట్స్ సరఫరా చేసినట్లు గుర్తించారు. ఈ స్కామ్ విలువ రూ.50 కోట్లకుపైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఇప్పటికే తిరుమల ప్రసాదాల తయారీకి సంబంధించి కల్తీ నెయ్యి సరఫరా, పరకామణిలో చోరీ అంశాలపై విచారణ జరుగుతోంది. ఈ సందర్భంలోనే పట్టు వస్త్రాల కుంభకోణం











