మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో ఓ భారీ పాన్ ఇండియా మూవీ రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇది చరణ్ కు 15వ చిత్రం, దిల్ రాజు 50వ చిత్రం కావడం విశేషం. ప్రస్తుతం ఈ సినిమా రాజమండ్రి సమీపంలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో విలన్ గా ఎస్ జె సూర్య అయితే బాగుంటుందని… అటు తమిళ్, ఇటు తెలుగుకు పరిచయం ఉన్న యాక్టర్ అని ఆయన్నే ఎంపిక చేశారట శంకర్.
ఇక అసలు విషయానికి వస్తే… ఇందులో చరణ్ ఎలక్షన్ ఆఫీసర్ గాను, ఎస్ జె సూర్య సీఎం గాను నటిస్తున్నారని తెలిసింది. అయితే.. పర్ ఫెక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ గా చరణ్ క్యారెక్టర్ ఉంటే.. ఈగో ఉన్న సీఎం క్యారెక్టర్లో ఎస్ జె సూర్య కనిపిస్తారట. సీఎం వర్సెస్ ఎలక్షన్ ఆఫీసర్ మధ్య జరిగే పోరే ఈ మూవీ స్టోరీ అని సమాచారం. అలాగే హీరో శ్రీకాంత్ కూడా కాస్త నెగిటివ్ టచ్ ఉన్న క్యారెక్టర్ లో కనిపిస్తారని తెలిసింది.
ఈ స్టోరీ బయటకు వచ్చినప్పటి నుంచి ఈ మూవీ పై మరింత క్యూరియాసిటీ పెరిగింది. ఎవరు ఎన్ని అంచనాలు పెట్టుకున్నప్పటికీ.. అంచనాలకు మించి.. ఈ మూవీ ఉంటుందట. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ భారీ పాన్ ఇండియా మూవీని 2023 సంక్రాంతికి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు నిర్మాత దిల్ రాజు. మరి.. చరణ్, శంకర్ ఈ పాన్ ఇండియా మూవీ ఈ రేంజ్ సక్సస్ సాధిస్తారో చూడాలి.











