ఏపీలో ఉద్యోగుల జీతాలు, జీవితాలు అగమ్యగోచరం!
ఉద్యోగులకు ఎన్నికల ముందు వరాల జల్లులు కురింపించారు జగన్. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే అంటూ.. మొదలుపెట్టి.. సమస్యలన్నీ నెరవెరుస్తానని హామీలు గుప్పించారు. తరువాత అది మరిచాడు. డిమాండ్ చేస్తే.. చర్చలు పేరుతో పిలిచి అనేక అవమానాలకు గురిచేశారు. 23 శాత పీఆర్సీ ఇచ్చి.. డీఏలో ఐఆర్ రికవరీ పెట్టారు. ఇది దారుణం.. దయతల్చండి అంటే.. మేము చెప్పిందే వినాలి అన్నట్లు ఒత్తిడి తీసుకొచ్చారని ఉద్యోగ సంఘాలు వాపోతున్నాయి. అయితే ఐఆర్ రికవరీ తప్పదు అన్న సంకేతాలు రావడంతో ఏపీ గెజిటెడ్ ఆఫీసర్స్ జేఏసీ ఛైర్మన్ కృష్ణయ్య దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది.
జీతం రికవరీ చేస్తే.. సీరియస్గా పరిగణిస్తాం!
ఈ ఏడాది జనవరి 17న జీవో నెంబర్ 1 లోని పదవ పేజీలో 12.4 వ పాయింట్ రికవరీ విషయాన్ని స్పష్టంగా పేర్కొంది ప్రభుత్వం. ఉద్యోగులు తీసుకున్న ఐఆర్ ను లెక్కించి, ఆ మొత్తాన్ని డీఏ ఎరియస్ నుంచి మినహాయిస్తామని చెప్పింది. 2019 జులై నుంచి 27 నుంచి 27 శాతం మధ్యంతర భృతి ( ఐఆర్ ) అమలు చేసింది. అయితే ప్రస్తుతం కొత్త పీఆర్సీలో భాగంగా జులై 2020 ఏప్రిల్ లో కొత్త వేతన స్థీకరణ చేసేవరకు 9 నెల కాలానికి ఐఆర్ ను మినహాయించుకునేలా జీవోలో స్పష్టంగా చెప్పింది జగన్ రెడ్డి ప్రభుత్వం! దీనిపై భగ్గుమన్న ఉద్యోగులు రోడ్డెక్కారు. వరస నిరసనలు తెలిపారు. చలో విజయవాడ పేరుతో నానా హైరానా చేశారు. చివరి ప్రభుత్వం ఏం చెప్పిందో దానికి ఒప్పుకుని స్టీరింగ్ కమిటీ చేతులెత్తేసింది. ఉద్యోగులు ఎంత డిమాండ్ చేస్తున్న న్యాయం ప్రకారం వారికి అందవల్సిన ఫలాలు నేటికి నెరవేర్చలేదనే చెప్పాలి. మిశ్రా కమిటీ ఇచ్చిన నివేదిక ఇప్పటికీ బయటపెట్టలేకపోయింది ప్రభుత్వం. ఇదిలా ఉంటే కొత్త పీఆర్సీ వ్యవహారంపై ఏపీ గెజిటెడ్ ఆఫీసర్స్ జేఏసీ ఛైర్మన్ కృష్ణయ్య హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ తరుపు న్యాయవాది వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయస్థానం.. ప్రభుత్వం జారీ చేసిన జీవోలను పిటిషనర్ కు ఇవ్వాలని ఆదేశించింది. ఉద్యోగులకు నష్టం చేకూరేలా జీవోలున్నాయని న్యాయవాది రవితేజ వాదనలు వినిపించారు. జీతం నుంచి రికవరీ చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతుందని న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. వాదనలు విన్న ధర్మాసనం.. పీఆర్సీపై ప్రభుత్వం జారీ చేసిన జీవోలను పిటిషనర్ ఇవ్వాలని, అలానే కౌంటర్ తో పాటు పీఆర్సీ నివేదికను దాఖలు చేయాలని స్పష్టం చేసింది. జీతం నుంచి రికవరీ చేసినట్లయితే తీవ్రంగా పరిగణిస్తామని ప్రభుత్వాన్ని హైకోర్టు హెచ్చరించారు. రెండువారాలకు తదుపరి విచారణను వాయిదా వేసింది.
Must Read:-మమ్మల్ని తిట్టిపోస్తున్నారు.. వినలేకపోతున్నాం! సీఎస్ కు జేఏసీ నేతల మొర!