పదిరోజుల లాక్ డౌన్ కఠినంగా అమలు చేయాలని ఇప్పటికే డీజీపీ మహేందర్‌రెడ్డి పోలీస్ అధికారులను ఆదేశించడంతో హైదరాబాద్ లో కఠిన లాక్ డౌన్ మొదలవుతుంది. పోలీసులు లాక్ డౌన్ సూత్రాలను పక్కగా అమలు చేస్తున్నారు. హైదరాబాద్ లో మొత్తం 168 చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ప్రధాన సెంటర్ల వద్ద నిఘా పెంచుతూ బయటకు వచ్చే వాళ్లను ప్రశ్నిస్తున్నారు. సరైన కారణంగా లేకుండా వచ్చేవాళ్లపై చర్యలు తీసుకుంటున్నారు. అత్యవసరమే కదా.. మాస్కు లేకుండా బయటకు వస్తే.. రూ.1000 జరిమానా విధిస్తున్నారు. దీంతో హైదరాబాద్ తో పాటు ఇతర జిల్లాల్లో కూడా లాక్ డౌన్ పక్కగా అమలవుతోంది. లాక్‌డౌన్ నేపథ్యంలో వేరే రాష్ట్రాలకు, ఇతర జిల్లాలకు వెళ్లే వారికి ఈ–పాస్ విధానం ద్వారా ప్రత్యేక పాసులు పోలీసులు అందజేస్తున్నారు. htt p://policeportal.tspolice.gov.in/ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకొని, ఈ-పాస్ లు పొందవచ్చు.
అండమాన్లో ఎగిరిన టీడీపీ జెండా..!
టీడీపీ,బీజేపీ కూటమి మరో ఘనత సాధించింది. అండమాన్ - నికోబార్ దీవుల్లో సత్తా...