విలక్షణ హీరో సూర్య, టాలెంటెడ్ డైరెక్టర్ సుధా కొంగర కాంబినేషన్ లో తమిళంలో రూపొందిన ప్రయోజనాత్మక చిత్రం ‘సూరారై పోట్రు’. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ సినిమా తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ పేరుతో విడుదలైంది. లాస్ట్ ఇయర్ అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ సినిమా యునానిమస్ గా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఓటీటీ సంస్థ కూడా అత్యధిక లాభాల్ని ఆర్జించింది. అలాగే ఆస్కార్ నామినేషన్ కూ ఎంపికైంది.
గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్ వేడుకల్లో ప్రదర్శితమైన ఈ సినిమా .. మరో అరుదైన గౌరవాన్ని కూడా దక్కించుకుంది. షాంఘై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లోని పనోరమా విభాగంలో చోటుదక్కించుకుంది. ఈ ఏడాది జూన్ 11 నుంచి జూన్ 20 వరకూ ఈ ఫిల్మ్ ఫెస్టివల్ జరగనుంది. ఐ.యమ్.డీ.బీ లో సైతం అత్యధిక రేటింగ్ పొందిన మూడో సినిమాగా ఆకాశం నీ హద్దురా నిలిచింది. అపర్ణా బాలమురళి కథానాయికగా నటించిన ఈ సినిమా సూర్య కెరీర్ లోనే ది బెస్ట్ గా నిలిచింది.