స్కెచ్ పారలేదా!?
వివేకా హత్యకేసులో కీలక నిందుతులుగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, యాదటి సునీల్ యాదవ్, గజ్జల ఉమాశంకర్ రెడ్డి, షేక్ దస్తగిరి లు కడప కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. వీరికి ప్రాణహాని ఉందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుుడు వర్ల రామయ్య సీబీఐ డైరెక్టర్ కు లేఖ రాశారు. కడప జైలు ఇంఛార్జిగా ఉన్న సూపరింటెండెంట్ వరుణారెడ్డిని అక్కడ నుంచి బదిలీ చేయాలని ఆయన లేఖలో కోరారు. గతంలో వరుణారెడ్డి అనంతపురం జిల్లా జైలు జైలర్ గా ఉన్నప్పుడు పరిటాల రవీంద్ర రాజకీయ హత్యకేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న మొద్దు శ్రీను కూడా అదే జైలులో బందీగా ఉన్నాడని గుర్తు చేశారు. ఆ సమయంలో మొద్దు శ్రీనును సహ నిందుతుడు డంబ్ బెల్ తో దారుణంగా హతమార్చాడని వర్ల పేర్కొన్నారు. అప్పుటి అనంతపురం జిల్లా జైలు జైలర్ గా ఉన్న వరుణారెడ్డి ఈ కేసులో అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారని, సస్పెండ్ కూడా అయ్యారని లేఖలో ప్రస్తావించారు వర్ల! వివేకా హత్యకేసులో నిందులుగా ఉన్న వారి ప్రాణాలకు రక్షణ కల్పించాలంటే ఆ నిందుతులను రాజమండ్రికి మార్చాలని, లేదా కడప జైలు నుంచి జైలర్ వరుణారెడ్డిని బదిలీ చేయాలని కోరారు.
వర్ల లేఖకు సీబీఐ యాక్షన్..
టీడీపీ నేత వర్ల రామయ్య లేఖతో సీబీఐ అప్రమత్తమైంది. వివేకా హత్య కేసులో నిందుతులుగా ఉన్న వారికి నెలకొన్న ప్రమాదంపై విచారించింది. టీడీపీ వ్యక్తం చేస్తున్న అనుమానాలను పరిగణలోకి తీసుకుంది. దీంతో నిందుతుల భద్రత దృష్ట్యా సూపరింటెండెంట్ గా విధులు నిర్వర్తిస్తున్న వరుణారెడ్డి బదిలీ అనివార్యమైంది. కడప నుంచి బంగోలు జైలర్ గా వరుణారెడ్డిని ప్రభుత్వం బదిలీ చేసింది. బంగోలు జైలర్ గా ఉన్న ప్రకాశ్ ను కడప జైలుకు బదిలీ చేసింది ప్రభుత్వం! ఇలా టీడీపీ వ్యక్తం చేసిన అనుమానాలు, ఆరోపణలతో సీబీఐ అప్రమత్తమైంది.
Must Read:-పల్నాడులో అధికారపార్టీ కండకావరం..! టీడీపీ లక్ష్యంగా దాడులు!!











