దేశంలో ఎక్కడ లేని ఆర్థిక సంక్షోభం ఏపీలోనే ఉంది..
దేశంలో ఎక్కలేని ఆర్థిక సంక్షోభం ఏపీలోనే ఉందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురంధేశ్వరి ఆరోపించారు. వైసీపీ పాలనలో తీసుకొస్తున్న అప్పులు కారణంగా రాష్ట్ర ప్రజలపై అధిక భారం పడుతోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే ఆదాయాన్ని చూపించి, అప్పులు తెచ్చుకునే దౌర్భగ్య పరిస్థితి ఏపీలో తప్ప.. దేశంలో ఎక్కడలేదని విమర్శించారు. ఈ విషయంపై నిర్మల సీతారామన్ కూడా జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించిందని పురంధేశ్వరి గుర్తు చేశారు. జగన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటి వరకు రూ. 3 లక్షల కోట్ల అప్పులు తెచ్చి ఏం చేశారని ఆమె నిలదీశారు. మరోవైపు ఏపీ రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందని మండిపడ్డారు. కేంద్రమంత్రి గడ్కరీ రోడ్లకు నిధులు ఇస్తే.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం గుప్పెడు మట్టి కూడా వేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ఎంపీకి రక్షణ లేని పరిస్థితిలో ఏపీ ఉందని పురంధేశ్వరి ఎద్దేవ చేసింది.
Must Read:-జగన్ రెడ్డి ప్రభుత్వానికి ఎన్టీటీ షాక్ ..! ఆ మూడు రిజర్వాయర్ల పనులు ఆపండి!!