నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి పరిషత్ ఎన్నికలు జరిపిన ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు వేసింది. కొత్త నోటిఫికేషన్ వేయాలని తీర్పునచ్చింది. హైకోర్టు తీర్పును స్వాగతిస్తూ టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య హర్షం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్య విజయమని ఆయన అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పద్ధతి మార్చుకొని చట్టానికి అనుగుణంగా వ్యవహరించాలని బుచ్చయ్య చౌదరి ట్వీట్ చేశారు.
Must Read ;- ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు రద్దు : హైకోర్టు సంచలన తీర్పు
ఏపీ పరిషత్ ఎన్నికలు రద్దు చేసిన హై కోర్టు
సుప్రీం కోర్టు మార్గదర్శకాలు కి అనుగుణంగా రాష్ట్రంలో ఎన్నికలు జరగలేదు.కొత్త నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలు జరపాలి అని సంచలన తీర్పు ఇచ్చిన హై కోర్ట్.ప్రజాస్వామ్య విజయం ఇది.ప్రభుత్వం ఇప్పటికైనా పద్దతి మార్చుకుని చట్టానికి అనుగుణంగా వ్యవహరించాలి— Gorantla butchaiah choudary (@GORANTLA_BC) May 21, 2021











