తిరుపతి రుయా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 11 మంది కరోనా రోగులు చనిపోయిన ఘటనపై హైకోర్టులో మరో కేసు నమోదైంది.ఈ ఘటనలో 36 మంది చనిపోతే కేవలం11 మంది మాత్రమే చనిపోయారని ప్రభుత్వం చెబుతోందని టీడీపీ నేత పీ.ఆర్.మోహన్ పిటీషన్ దాఖలు చేశారు.పిటీషనర్ తరఫున న్యాయవాది బాలాజీ వాదనలు వినిపించారు.ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేసుకోలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.ఆక్సిజన్ అందకే కరోనా రోగుల ప్రాణాలు పోయాయని కోర్టులో వాదనలు వినిపించారు.కరోనా రోగులు చనిపోయిన ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించాలని పిటీషనర్ తరఫు న్యాయవాది ధర్మాసనానికి విజ్ఙప్తి చేశారు.
నోటీసులు జారీ
కేంద్ర ప్రభుత్వం ఐదు ఆక్సిజన్ ప్లాంటులు పంపించినా నేటికీ వాటిని ఏర్పాటు చేయలేదని పీఆర్ మోహన్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.దీనిపై స్పందించిన ధర్మాసనం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు జిల్లా ఎస్పీకి నోటీసులు జారీ చేసింది.ఈ కేసును వేసవి సెలవుల అనంతరం తదుపరి విచారణకు ధర్మాసనం వాయిదా వేసింది.
Must Read ;- నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వండి..రుయా ఘటనపై స్పందించిన ఎన్‌హెచ్‌ఆర్సీ











