కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది. సుప్రీంకోర్టు సూచించిన నిబంధనల ప్రకారం ఎన్నికలు జరగలేదని ధర్మాసనం అభిప్రాయపడింది. దీంతో మరలా తాజాగా నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. గత ఏడాది మార్చిలో కరోనా మొదటి వేవ్ కారణంగా నామినేషన్ల అనంతరం వాయిదాపడ్డ ఎంపీటీసీ, జడ్సీటీసీ ఎన్నికలను గత నెలలో పూర్తి చేశారు. ఎన్నికలకు కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. దీనిపై పలు పార్టీల నేతలు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. పోలింగ్ కు నాలుగు వారాల ముందు నోటిఫికేషన్ ఇవ్వాలన్న సుప్రీంకోర్టు నిబంధనలు పాటించలేదని ధర్మాసనం గుర్తుచేసింది.
ముందు డివిజన్ బెంచ్ కు అప్పీలు
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేయాలని నిర్ణయించింది. గతంలో కూడా సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పులను డివిజన్ బెంచ్ కొట్టేసిన సందర్బాలు అనేకం ఉన్నాయి. దీంతో ప్రభుత్వం ముందుగా డివిజన్ బెంచ్ ను ఆశ్రయించాలని నిర్ణయించింది.
Must Read ;- రుయా ఘటనపై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు











