నేచురల్ స్టార్ నానీ ప్రస్తుతం యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘టక్ జగదీష్’ , కోల్ కత్తా బ్యాక్ డ్రాప్ లో సాగే.. పీరియాడికల్ థ్రిల్లర్ ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాల్ని ఒకేసారి ట్రాక్ మీద పెట్టుకున్నాడు. ఈ రెండు సినిమాలకి విడుదల తేదీలు ఫిక్స్ చేసినా.. కరోనా సెకండ్ వేవ్ వల్ల వాటి షెడ్యూల్స్ అప్సెట్ అయ్యాయి. దాంతో విడుదల తేదీల్లోనూ మార్పులొచ్చాయి.
ఇక ఇప్పుడు నానీ తదుపరి చిత్రం మీద అందరిలోనూ ఆసక్తి మొదలయింది. తాజా సమాచారం ప్రకారం.. నానీ త్వరలో ఓ స్పోర్ట్స్ బేస్డ్ మూవీలో నటించబోతున్నాడట. అందులో నానీ పుట్ బాల్ ప్లేయర్ గా నటించబోతున్నాడనే టాక్స్ వినిపిస్తున్నాయి. నానీ మొన్నామధ్య గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో జెర్సీ సినిమాలో క్రికెటర్ గా నటించిన సంగతి తెలిసిందే. దీన్ని టాలీవుడ్ ‘పర్ఫ్యూట్ ఆఫ్ హ్యాపీనెస్’ గా అభివర్ణించారు క్రిటిక్స్. దాంతో పాటు సినిమాకి నేషనల్ అవార్డ్ కూడా వచ్చింది.
దాంతో ఇప్పుడు నానీ నటించబోయే ఫుట్ బాల్ ప్లేయర్ పాత్ర పై పడింది అందరి దృష్టి. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి.. దర్శకుడు, నిర్మాత ఎవరు అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. అయితే ఈ సినిమా కథాంశం మాత్రం అజయ్ దేవ్ గన్ నటిస్తోన్న బాలీవుడ్ చిత్రం ‘మైదాన్’ ను పోలి ఉంటుందని చెప్పుకుంటున్నారు. ఆ సినిమా ప్రముఖ ఫుట్ బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహమాన్ బయోపిక్ గా రూపొందుతోంది. మరి ఈ సినిమా నిజంగానే మైదాన్ ను పోలి ఉంటుందో లేదో తెలియాలంటే.. కొద్దిరోజులు ఆగాల్సిందే.
Must Read ;- ‘ఫిదా’ జంటతో భీష్మ దర్శకుడు నిజమేనా?











