ఆంధ్రప్రదేశ్ లో రాజ్యాంగ సంక్షోంభం ఏర్పడిందని టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో భావ ప్రకటన స్వేచ్ఛ కనుమరుగు అయిందని, ప్రభుత్వం నియంతృత్వ ధోరణి ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు చేస్తున్నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 14 ని ఏపీ పాలకులు కాల రాస్తున్నారని పేర్కొన్నారు. పోలీసులను అడ్డం పెట్టుకొని పాలన చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో ఒకవైపు కేసులు పెరుగుతుంటే, మరోవైపు అక్రమ అరెస్ట్ చేయడం ఏంటి? అని బుచ్చయ్య చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు.
Must Read ;- రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలి : తులసిరెడ్డి
రాష్ట్రంలో భావ ప్రకటన స్వేచ్ఛ కనుమరుగు అయింది.ప్రభుత్వం నియంతృత్వ ధోరణి ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు చేస్తున్నారు. ఇదేనా పరిపాలన చెయ్యడం అంటే.భారత రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 14 ని కాల రాస్తున్నారు.రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడింది.#గోరంట్ల
— Gorantla butchaiah choudary (@GORANTLA_BC) May 17, 2021











