శ్రీముఖి ఎక్కడ ఉంటే అక్కడ అరుపులు .. కేకలు .. సంతోషం .. సందడి షరా మామూలే. రీసెంట్ గా అవినాశ్ కి ఇచ్చిన వెల్ కమ్ బ్యాక్ పార్టీలోనూ ఆమె తనదైన తరహాలోనే సందడి చేసింది. ‘బిగ్ బాస్ 4’ హౌస్ లో 13 వారాలపాటు అవినాశ్ కొనసాగాడు. తనకి తెలిసింది నవ్వించడమే గనుక ఆయన అదే మార్గంలో ముందుకు వెళ్లాడు. అందరి ఆదరాభిమానాలను అందుకుంటూ ఎలిమినేషన్స్ నుంచి బయటపడుతూ వచ్చాడు. క్రితం వారం మాత్రం ‘మోనాల్’ బయటికి వచ్చేస్తుందని అంతా అనుకున్నారు. ఎందుకంటే ఇప్పటివరకూ ఆమె ఎలిమినేషన్ కాకుండా ఉండటమే గొప్పవిషయం అనుకునేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అయితే అనుకోకుండా అవినాశ్ బిగ్ బాస్ హౌస్ ను వదిలిపెట్టవలసి వచ్చింది.
ఎలిమినేషన్ రోజున అవినాశ్ సహజంగానే కొంత బాధగా కనిపించాడు. అంత బాధలోను ఆయన హౌస్ లోని ఇతర పోటీదారులను స్టేజ్ పై అనుకరిస్తూ నవ్వించాడు. అక్కడి నుంచి ఇంటికి చేరుకున్న అవినాశ్ కి ఆయన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీముఖి స్వాగతం చెప్పింది. అరుపులతో .. కేకలతో తనదైన తరహాలో సందడి చేసింది. ‘బాస్ ఈజ్ బ్యాక్’ అంటూ, అప్పటికే సిద్ధంగా ఉంచిన కేక్ ను అతనితో కట్ చేయించి హడావిడి చేసింది. శ్రీముఖి చేసిన అల్లరితో ఒక్కసారిగా వాతావరణం మారిపోవడంతో, ఎలిమినేషన్ ప్రభావం నుంచి అవినాశ్ బయటపడినట్టుగానే కనిపించాడు.
ఈ సందర్బంగా అవినాశ్ మాట్లాడుతూ .. ” ఆ ఇంటి నుంచి నా ఇంటికి వచ్చాను .. మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికీ పాదాభివందనాలు. ఎనిమిది తొమ్మిదేళ్లుగా మీరంతా నన్ను ఎంతగానో ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు. ‘బిగ్ బాస్’ హౌస్ లో 13వారాలుగా నా ఆట నేను ఆడాను. మీ అందరినీ ఎంటర్టైన్ చేశాననే అనుకుంటున్నాను. నేను నామినేట్ అయిన ప్రతిసారి నన్ను సేవ్ చేస్తూ వచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బిగ్ బాస్ హౌస్ లో కొనసాగిన నా ప్రయాణాన్నీ .. మీ అందరూ అందించిన సహాయ సహకారాలను నేను ఎప్పటికీ మరిచిపోలేను” అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
Must Read ;- యాంకర్ శ్రీముఖి డేటింగు పుకార్లా.. నిజమా?











