బిగ్ బాస్ 4 రియాలిటీ షో ఓ ఫేక్ షో అనుకోవాలా? నిన్న ఎలిమినేషన్ ప్రక్రియను చూస్తుంటే ఇది నిజమేనేమో అన్న అనుమానం కలుగుతోంది. మోనాల్ ను బిగ్ బాస్ కావాలనే రక్షిస్తున్నాడని అర్థమవుతోంది. మొదట్నుంచీ కూడా ఈ ఎలిమినేషన్ ప్రక్రియలో గందరగోళం కొనసాగుతూనే ఉంది. ఈసారి మోనాల్ ఎలిమినేషన్ తప్పనిసరి అని అందరూ అనుకున్నారు.. కానీ అవినాష్ ఎలిమినేషన్ జరిగింది. మోనాల్ ను ఎందుకు రక్షించాల్సి వస్తోంది అనడానికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళ్లే ముందు అసలు ఏం జరుగుతుందో చూద్దాం.
సాధారణంగా ఇలాంటి రియాలిటీ షోలలో జనాభిప్రాయమే ఉండాలి. సొంత అభిప్రాయాలకు చోటుంటే అది రియాలిటీ షో కాదు.. ఇట్స్ ఏ ఫేక్ షో. మొదట్నుంచీ కూడా ఎలిమినేషన్ ప్రక్రియలో పక్షపాత ధోరణి కనిపిస్తోంది. తనకు నచ్చిన వారిని సేవ్ చేసుకోవచ్చనే అభిప్రాయం బిగ్ బాస్ లో ఉన్నట్లు స్పష్టమవుతోంది. భవిష్యత్తులో ఈ షో మీద మరిన్ని విమర్శలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటిదాకా వరుసగా ఎలిమినేషన్ అయిన వారిని చూస్తే దివి, కుమార్ సాయి, దేవీ నాగవల్లి ఎలిమినేషన్ జరిగినప్పుడు కూడా విమర్శలు వెల్లువెత్తాయి.
బిగ్ బాస్ నిర్ణయం మేరకే ఈ ఎలిమినేషన్లు జరిగాయన్న అభిప్రాయంలో జనంలో వచ్చింది. అంతా లీకులమయంగానే షో కొనసాగుతోంది. జనం ఊహకు అందకుండా ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగించాలనుకుంటున్నారా? లేదా ఏవైనా శక్తులు దీనివెనుక పనిచేస్తున్నాయా అనే అనుమానాలు ఇప్పుడు బలపడుతున్నాయి. ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనేది ముందే తెలిసిపోతోంది. ఇది ఒక కోణమైతే ఓటింగ్ ప్రకారం ఎలిమినేషన్ జరగకపోవడం ఇంకో కోణం. ఒకరు ఎలిమినేట్ అవుతారనుకుంటే ఇంకొకరు ఎలిమినేట్ కావడం కూడా ఈ షోపై అనుమానాలు రేకెత్తిస్తోంది.
Also Read ;- వంటలక్క వర్సెస్ బిగ్ బాస్
మెహబూబ్ కు బదులు దేవి నాగవల్లి ఎలిమినేట్ కావడం, అలాగే అవినాష్, మోనాల్ లలో ఒకరు ఎలిమినేట్ అవుతారనుకుంటే ఇంకొకరి ఎలిమినేషన్ జరిగింది. అసలు మోనాల్ పై మొదట్నుంచీ అనేక అనుమానాలు ఉన్నాయి. హోస్ట్ నాగార్జునకు ముద్దు బిడ్డ అనే ప్రచారం కూడా సాగింది. నిజానికి మోనాల్ ఎలిమినేషన్ నిన్న జరగాల్సి ఉంది. చివరిలో ఏదో శక్తి ఆమెని కాపాడటంతో అవినాష్ బలిపశువు అయ్యాడు. ఓటింగ్ లో ఆఖరున ఉన్న మోనాల్ ను కాకుండా అవినాష్ ను ఎందుకు ఎలిమినేట్ చేశారన్న ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ ఉంది. ఈ వివాదం బిగ్ బాస్ షోకు మాయని మచ్చగానే చెప్పాల్సి ఉంటుంది.
మోనాల్ పై ఎందుకింత ప్రేమ?
కంటెస్టెంట్లలో మోనాల్ అంతో ఇంతో అందంగా ఉంటుంది. అదొక్కటే ఆమెను కాపాడుతోందని అనుకోడానికి వీలు లేదు. సాధారణంగా ఈ షోలో పాల్గొనే వారితో మొదటే ఓ అగ్రిమెంట్ ఉంటుందట. ఎన్ని వారాలకు అగ్రిమెంటు చేసుకుంటే అన్ని వారాలకు వారికి ఆ డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ వారు ముందే ఎలిమినేట్ అయినా అగ్రిమెంటు చేసుకున్నన్ని వారాలకు డబ్బు చెల్లించాల్సిందే. మోనాల్ తో చేసుకున్న అగ్రిమెంటు ముగియకపోవడం వల్లే ఆమెను షోలో కొనసాగిస్తున్నారన్న వాదన ఉంది.
షోలో ఏడుపు తప్ప వేరే ఏమీ చేయలేకపోతున్న మోనాల్ ఇప్పుడు మళ్లీ సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయింది. ఆమె బదులు ఎవరో ఒకరు బలి అవక తప్పడం లేదు. వచ్చే వారం ఈ షో ఇంకా రసకందాయంలో పడుతుంది. కచ్చితంగా అప్పుడు మోనాల్ ఎలిమినేషన్ జరిగితీరాల్సిందే. ఈ రెండు వారాల్లో షో ముగియనుండటమే దీనికి ప్రధాన కారణం. ఈ వారం ఈ బిగ్ బాస్ షో టాక్ ఆఫ్ ది షో మాత్రం మోనాల్ అని చెప్పక తప్పదు. మొత్తానికి బిగ్ బాస్ బాహువుల్లో మోనాల్ క్షేమంగా ఉంది.. అవినాష్ మాత్రం బలికాక తప్పలేదు.
Must Read ;- బిగ్ బాస్ 4 ఫైనల్ ఎపిసోడ్ కు ఈ స్టార్ హీరో వస్తాడా?











