శ్రీముఖి అనే పేరుకు .. చిలిపి చూపులు .. కొంటెనవ్వులు .. అల్లరి అందాలు .. సరదా సందళ్లు పర్యాయ పదాలుగా కనిపిస్తాయి. కుర్రాళ్ల మనసు మందిరాల్లో నుంచి ఆమె మాటలు మంత్రాల్లా వినిపిస్తాయి. బుల్లితెరపై శ్రీముఖి ఆటపాటలను చూస్తూ వాళ్లంతా మనసు మైదానంలో ఆనందాల విన్యాసాలు చేస్తారు. చేపకళ్లతో ఆమె విసిరే కొంటె చూపులను కోటి అనుభూతులుగా మార్చుకుని గుండె గదుల్లో గుంభనంగా దాచుకుంటారు. శ్రీముఖి యాంకరింగ్ లో ఒక కొత్త అధ్యాయాన్ని సృష్టించిందనే చెప్పాలి. బుల్లితెర కార్యక్రమాలకు ఆమె గ్లామర్ కోటింగ్ ఇచ్చింది. ఈ విషయంలో అప్పటికే రేసులో వున్న అనసూయ .. రష్మీలను ఆమె దాటుకుని వెళ్లింది.
శ్రీముఖి యాంకరింగ్ చేస్తుంది గదా అని ఆమెను కేవలం ఒక యాంకర్ గానే చూడలేం. ఎందుకంటే ఒక గ్లామరస్ హీరోయిన్ కి ఎంత క్రేజ్ ఉంటుందో .. శ్రీముఖికి అంత క్రేజ్ వుంది. వెన్నెల్లో చందమామలా కనిపించే ఈ అమ్మాయి సినిమాల్లోనే చేయవచ్చుగదా అనే అభిప్రాయాలను కూడా చాలామంది వ్యక్తం చేశారు. అందుకేనేమో ఈ అమ్మాయి ఒక వైపున బుల్లితెరపై సందడి చేస్తూనే, మరో వైపున వెండితెరను కూడా టచ్ చేసి వచ్చింది. ప్రస్తుతం బుల్లితెరకి సంబంధించి రెగ్యులర్ షోలను .. స్పెషల్ షోలను చేస్తూ ఆమె తీరికలేకుండా వుంది. ఛానల్స్ మారుస్తూ వెళ్లే ప్రేక్షకులు, శ్రీముఖి కనిపిస్తే చాలు రిమోట్ పక్కన పెట్టేస్తారు. శ్రీముఖి అందానికి .. అల్లరికి కళ్లను అప్పగించేస్తారు.
అందానికే అడ్రెస్ లా కనిపించే శ్రీముఖి, సోషల్ మీడియాలోను చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకి సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఒక్కోసారి తన హాట్ పిక్స్ ను కూడా పోస్ట్ చేసి, పొలోమంటూ కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టేస్తుంది. తాజాగా ఆమె తన ఇన్ స్టా గ్రామ్ లో రెండు హాట్ పిక్స్ ను పోస్ట్ చేసింది. రెడ్ నైట్ వేర్ లో సన్ షైన్ ను ఎంజాయ్ చేస్తూ ఒక పిక్ పోస్ట్ చేసి, ‘టేక్ మీ బ్యాక్’ అంటూ కామెంట్ పెట్టింది. ‘అందం చూడవయా .. ఆనందించవయా’ అన్నట్టుగా వున్న మరో పిక్ ను కూడా ఆమె షేర్ చేసింది. పచ్చని పసిమి ఛాయలో .. ఎరుపు రంగు డ్రెస్ తో ఇక్కడ శ్రీముఖిని చూసినవాళ్లు, బ్రహ్మదేవుడు ఈ అమ్మాయిని గులాబీ గుత్తులతో చేశాడా? పసుపును పాలల్లో కలిపి తయారు చేశాడా? అనుకోవడం సహజం.