బిగ్ బాస్ 4.. స్టార్ట్ అయినప్పుడు కంటెంస్టంట్లు పెద్దగా తెలిసిన వాళ్లు లేరు. ఈసారి షో ఎలా ఉంటుందో అనుకున్నారు జనాలు. మొదట్లో అంతగా ఆసక్తి చూపించకపోయినా.. రానురాను షో పై ఆసక్తి ఏర్పడింది. ఇక ఫైనల్ ఎపిసోడ్ దగ్గర పడుతున్న కొద్దీ షో రసవత్తరంగా సాగుతుంది. దీంతో బిగ్ బాస్ 4 విన్నర్ ఎవరు అవుతారు..? ఆ టైటిల్ ని విజేతకు ఇచ్చేందుకు గెస్ట్ గా ఎవరొస్తారు..? అనేది ఆసక్తిగా మారింది. బిగ్ బాస్ 3 సీజన్ కు మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా వచ్చారు. ఆరోజు చిరు చేసిన సందడి అంతా ఇంతా కాదు. అందుకనే ఆ ఎపిసోడ్ రికార్డ్ టీఆర్పీ సొంతం చేసుకుంది. ఎప్పటికీ మరచిపోలేని ఎపిసోడ్ గా నిలిచింది.
ఇక ఇప్పుడు బిగ్ బాస్ 4 ఫైనల్ ఎపిసోడ్ కి ఆస్ధాయిలో గెస్ట్ ని తీసుకువచ్చేందుకు స్టార్ మా యాజమాన్యం ప్రయత్నాలు ప్రారంభించిందని సమాచారం. ఈసారి ఎవర్నీ గెస్ట్ గా తీసుకురానున్నారంటే.. నలుగురు స్టార్ హీరోలను సంప్రదించినట్టు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ.. ఆ.. నలుగురు ఎవరంటారా..? సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఈ నలుగురు స్టార్ హీరోలను కాంటాక్ట్ చేసినట్టు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ఈ వార్త లీకైనప్పటి నుంచి ఆడియన్స్ లో మరింత క్యూరియాసిటీ పెరిగిందని చెప్పచ్చు.
మరో విషయం ఏంటంటే… ఈసారి స్టార్ హీరోనే కాకుండా… ఒకరిద్దరు దర్శకుల పేర్లను కూడా పరిశీలిస్తున్నారట. అంతే కాకుండా… నాగార్జున వైల్డ్ డాగ్ షూటింగ్ కి వెళ్లినప్పుడు సమంత బిగ్ బాస్ షోకి హోస్ట్ గా చేసింది. ఆ ఎపిసోడ్ కి రికార్డ్ టీఆర్పీ రేటింగ్ వచ్చింది. అందుచేత సమంతని చైతన్యతో కలిసి మరోసారి బిగ్ బాస్ స్టేజ్ మీదకి తీసుకురావాలి అనుకుంటున్నారట. మొత్తానికి బిగ్ బాస్ 4 ఫైనల్ ఎపిసోడ్ రోజురోజుకు అంచనాలను పెంచేస్తుంది. మరి… మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్.. ఈ నలుగురులో ఎవరో ఒకరు గెస్ట్ గా వస్తారా..? లేక ఈ నలుగురు కాకుండా మరో స్టార్ గెస్ట్ గా వస్తారో… క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
Must Read ;- వంటలక్క వర్సెస్ బిగ్ బాస్











