బిగ్ బాస్ 4 ఫైనల్ ఎపిసోడ్ కి టైమ్ దగ్గర పడుతున్న కొద్దీ మరింత ఆసక్తి ఏర్పడిందని చెప్పచ్చు. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు అనేది ఆసక్తిగా మారింది. గత వారం అవినాష్ నామినేషన్ లో ఉండగా.. తక్కువ ఓట్లు ఉన్నప్పటికీ తన దగ్గర ఉన్న ఎవిక్షన్ ఫ్రీ కార్డ్ ద్వారా బయటపడ్డాడు. ఈ వారం కూడా అవినాష్ నామినేషన్ లో ఉండడంతో ఈ వారం బయటపడతాడా..? లేక హౌస్ నుంచి బయటకు వచ్చేశాడా.? అని వీక్షకులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. గత వారం అవినాష్ కి తక్కువ ఓట్లు పడడంతో ఈసారి ఎక్కువ ఓట్లు వస్తాయి అందుచేత అవినాష్ ఈ వారం కూడా సేవ్ అవుతాడు అనుకుంటున్నారు.
ఇదిలా ఉంటే… ఈ వారం హౌస్ నుంచి బయటకు వచ్చేది మోనాల్ అంటూ ప్రచారం జరిగింది. అంతే కాకుండా మోనాల్ హౌస్ నుంచి బయటకు వచ్చేసిందని మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. దీంతో అంతా మోనాలే అవుట్ అనుకున్నారు. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే… హౌస్ నుంచి బయటకు వచ్చేది మోనాల్ కాదట. అవినాషే అని సమాచారం. కారణం ఏంటంటే… అవినాష్ మోనల్ ని అన్యాయంగా టార్గెట్ చేయడం.. ఆటను సరిగా ఆడకపోవడం.. అంతా ప్రేక్షకులు గమనించారు. అలాగే అవినాష్ తన సహనం కోల్పోయాడు.
మోనాల్ పైన, అరియానా పైన అఖిల్, సోహల్ పైన కోపాన్ని ప్రదర్శించి గెలుపు అవకాశాలను స్వయంగా చెడగొట్టుకున్నాడు. ముఖ్యంగా తన పై తనే నమ్మకాన్ని పొగొట్టుకుని ప్రేక్షకుల ఓట్లు సాధించడంలో బాగా వెనకబడ్డాడు. అందుకనే ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేది అవినాషే అని తెలిసింది. మరి.. ప్రచారంలో ఉన్నది వాస్తవమేనా..? కాదా..? అనేది ఈ రోజు రాత్రికి తెలుస్తుంది.
Must Read ;- బిగ్ బాస్ 4 విజేత అభిజిత్ కాకపోతే ఎవరు?











