‘స్టార్ మా’ లో ప్రసారమవుతున్న బిగ్ బాస్ 4 సీజన్ కోసం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే రిలీజ్ అయిన మూడు సీజన్లకు మంచి రెస్పాన్స్ వచ్చినట్లే నాలుగోవ సీజన్ కి కూడా ప్రేక్షకుల నుండిభారీ ఎత్తున స్పందన లభించింది. ఇప్పుడు ఈ సీజన్ ఫైనల్ కు చేరుకోబోతోంది. నాగార్జున అక్కినేని హోస్ట్ గా చేస్తున్న ఈ సీజన్ ఫైనల్ ఎపిసోడ్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాబోతున్నట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ నిర్వాహకులు ఫైనల్ ఎపిసోడ్ ను భారీ స్థాయిలో డిజైన్ చేశారని సమాచారం.
ఇప్పటికే అనేకమంది సినీ ప్రముఖులు వివిధ ఎపిసోడ్స్ కు హాజరై సందడి చేసిన సంగతి తెలిసిందే. ఆ ఎపిసోడ్స్ కి సంబంధించి టీఆర్పీ రేటింగ్స్ కూడా భారీ స్థాయిలోనే వచ్చాయి. ఇక ఒకసారి సమంత చేసిన హోస్టింగ్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అక్కినేని ఫ్యామిలీ సభ్యులందరూ బిగ్ బాస్ కోసం బాగానే కష్టపడ్డారనే చెప్పాలి. అదే విధంగా ఫైనల్ ఎపిసోడ్ కి కూడా మంచి టీఆర్పీ రేటింగ్స్ వచ్చేలా ప్లాన్ చేశారని సమాచారం. ఇద్దరు టాలీవుడ్ టాప్ స్టార్ లను ఒకే వేదికపై చూస్తే ఆ కిక్కే వేరబ్బా అని ఇప్పటినుండే ప్రేక్షకులు ఫైనల్ ఎపిసోడ్ కోసం మాట్లాడుకుంటున్నారు.
ఇప్పటికే ఎన్టీఆర్ ఒక సీజన్ కు హోస్ట్ గా ఉన్నాడు. ఆ పరిచయంతోనే ఫైనల్ ఎపిసోడ్ కు వచ్చే విధంగా బిగ్ బాస్ నిర్వాహకులు ఎన్టీఆర్ ను ఒప్పించారని సమాచారం. అక్కినేని అభిమానులతో పాటుగా నందమూరి అభిమానులు కూడా ఫైనల్ ఎపిసోడ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ఎపిసోడ్ కు భారీ టీఆర్పీ రేటింగ్స్ రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఈ రోజు జరిగే ఎపిసోడ్ లో అవినాష్ ఎలిమినేట్ అవుతాడని ప్రచారం జరుగుతోంది. మరి ఆ ప్రచారంలో నిజమెంత ఉందో తెలియాలంటే ఇంకొన్ని గంటలు ఆగాల్సిందే.
Also Read: బిగ్ బాస్ విజేత కాబోయేది ఎవరు?