ఈ సమావేశంలో తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్, నిర్మాతలు, పంపిణీదారులు ప్రదర్శనదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్టీప్లెక్స్‌లు, ఇతర థియేటర్లను పునఃప్రారంభించే అంశంతో పాటు పలు అంశాలను చర్చించారు. నిర్మాతలు వీపీఎఫ్ ఛార్జీలు చెల్లించరని, కంటెంట్ ట్రాన్స్‌పోర్ట్ కోసం నిర్మాతలు నామమాత్రపు ఛార్జీలు చెల్లిస్తారని, డిజిటల్ ప్రొవైడర్లు తమ రెండు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాల ప్రొజెక్టర్లను థియేటర్ ఓనర్స్ కొనుగోలు చేయడానికి డిజిటల్ ప్రొవైడర్లు ఒక ఆప్షన్ ఇస్తారని దీనివల్ల ప్రకటనల ఆదాయాన్ని స్వీకరించడానికి థియేటర్ ఓనర్స్ కు వీలు కల్గుతుందని అభిప్రాయపడ్డారు
థియేటర్ యజమానులు ప్రొజెక్టర్లను కొనుగోలు చేయలేకపోతే, నిర్మాతలు కొంతవరకు కల్పించుకొని వారి ప్రొజెక్టర్లను కొనుగోలు చేయడానికి సహాయం చేస్తారని, ఒకవేళ డిజిటల్ ప్రొవైడర్లు అంగీకరించకపోతే, థియేటర్ యజమానులు వారి సొంత ప్రొజెక్టర్లుతో నడిపిస్తారన్న అన్న అంశాలపై ప్రధానంగా చర్చించారు. తిరిగి ఈ నెల 17 న సాయంత్రం 4.00 గంటలకు సమీక్షా సమావేశం నిర్వహించాలని ఇదే సమావేశంలో నిర్ణయించారు.
Must Read ;- కృతిశెట్టి గ్లామర్ ఉప్పెన కాదు సునామీ!