కరోనా కారణంగా గత ఎనిమిది నెలల తర్వాత ఈ రోజు థియేటర్స్ ఓపెన్ చేసారు. కేంద్రప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం థియేటర్స్ ఓపెన్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చినప్పటికీ… అందరిలో ఒకటే డౌట్. సినిమా చూడడానికి జనాలు వస్తారా..? రారా..? అని. అయితే… ఈరోజు థియేటర్లు ఓపెన్ చేశారని తెలియగానే… ఇండస్ట్రీలో, సినీ ప్రియుల్లో ఓ ఉత్సాహం వచ్చింది. ప్రభుత్వం 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు ఓపెన్ చేసుకోవచ్చు అని జీఓ జారీ చేసినప్పడు 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లను రన్ చేయడం కష్టమని ఇండస్ట్రీకి సంబంధించిన కొంత మంది అభ్యంతరం వ్యక్తం చేసినా.. ఆఖరికి ఈరోజు నుంచి థియేటర్లు ఓపెన్ చేయాలని నిర్ణయించుకున్నారు.
టిక్కెట్ రేటు పెంచుకోవడానికి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చినప్పటికీ… టిక్కెట్ రేటు పెంచలేదు. అయితే… ఈరోజు థియేటర్స్ ఓపెన్ చేయడంతో సినీ ప్రముఖులు థియేటర్ లో సినిమా చూస్తూ తమ ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. డైరెక్టర్ శేఖర్ కమ్ముల, డైరెక్టర్ మారుతి తదితరులు సినిమా హాల్ లో సినిమా చూసి… తమ స్పందనను సోషల్ మీడియా ద్వారా తెలియచేసారు. థియేటర్ లో సినిమా చూస్తుంటే… లైఫ్ మళ్లీ బ్యాక్ వచ్చినట్టుగా ఉంది. థియేటర్లకు స్వాగతం. చాలా ఆనందంగా ఉంది అంటూ తమ సంతోషాన్ని వ్యక్తం చేసారు.
అయితే…ఇప్పటి వరకు సినిమా చూడడానికి జనాలు థియేటర్ కి వస్తారా అనే అనుమానం ఉంది. ఈరోజు ఉదయం వైజాగ్ జగదాంబ థియేటర్ లో టెనెట్ మూవీని ప్రదర్శించారు. ఈ షోకు జనాలు వస్తారా రారా అనుకుంటే… హౌస్ ఫుల్ అవ్వడం విశేషం. 44132 కలెక్షన్ తో ఫుల్ అయినట్టు సమాచారం. దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు జనాలు థియేటర్లో సినిమాలు చూడడానికి సిద్ధంగా ఉన్నారని. రానున్న రోజుల్లో అన్ని ఏరియాల్లో ఇలాగే హౌస్ ఫుల్ అవుతాయి.. థియేటర్లకు మళ్లీ పూర్వ వైభవం వస్తుంది అనే నమ్మకాన్ని కలిగించింది. ఆ రోజులు.. అతి త్వరలో రానున్నాయని ఆశిద్దాం.
Must Read ;- ఆకాశం నీ హద్దురా సినిమా థియేటర్స్ కి రాదగ్గ సినిమానట.. !











