ప్రముఖ నిర్మాత, పంపిణీదారులు ముత్యాల రాందాస్ ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ముత్యాల రాందాస్ మాట్లాడుతూ, “ఇప్పటివరకు రెండు తెలుగు రాష్ట్రాలలో చాలా స్వల్ప సంఖ్యలో థియేటర్లు ఓపెన్ అయ్యాయి. ఈ నెల 25వ తేదీ నాటికి పూర్తిస్థాయిలో థియేటర్లు తెరచుకుంటాయని భావిస్తున్నాం. దానిని దృష్టిలో పెట్టుకునే ఈ నెల 25న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం. వాస్తవానికి ఇంకా ముందే ఈ చిత్రాన్ని విడుదల చేయాలని అనుకున్నాం కానీ థియేటర్లు ఓపెన్ కానందువల్లే ఆలస్యమైంది. కంటెంట్ ప్రధానంగా తీసిన ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకులను అలరింపజేస్తుందన్న నమ్మకం ఉంది” అని అన్నారు.

దర్శకుడు జయప్రకాష్ మాట్లాడుతూ, “నలుగురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిల మధ్య ఆసక్తికరంగా సాగే ఇతివృత్తంతో ఈ చిత్రాన్ని మలిచాం. ఒక అమ్మాయిని రక్షించడానికి మిగతావాళ్లు ఎలా తపన చెందారన్న అంశం తెరపై చూడాల్సిందే. సహజత్వానికి దగ్గరగా ఉండే భావోద్వేగాలతో ఒక్కొక్కరి జీవిత ప్రయాణం ఏవిధంగా మలుపులు తిరిగిందన్నదే ఈ చిత్రం. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ఆద్యంతం ఆకట్టుకుంటుంది” అని చెప్పారు. నిర్మాత సుజాత ఆళ్ళ మాట్లాడుతూ,,“మూడు జంటల ప్రేమ కథ ఎలాంటి మలుపులు తిరిగిందన్న అంశంతో దర్శకుడు ఈ చిత్రాన్ని ఎంతో బాగా తెరకెక్కించారు. ముత్యాల రాందాస్ సంపూర్ణ సహకారంతో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం ” అని అన్నారు. ఇంకా ఈ సమావేశంలో హీరోలు రామ్, జగదీష్, సంజయ్ ఆచార్య, హీరోయిన్లు కిస్లే చౌదరి, రేఖ నిరోషా, మంజీర, మరో నిర్మాత రాంకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఈశ్వర్ హేమకాంత్, ప్రభంజన్, ఎడిటింగ్: వెంకటేశ్వరరావు పాశం నిర్మాత: సుజాత ఆళ్ళ, కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: జయప్రకాష్.కె.
Also Read ;- https://www.theleonews.com/vedhika-hot-pics-in-beach/











