కరోనా లాక్ డౌన్ సినీ రంగాన్ని 6 నెలల నుంచీ హోల్డ్ లోనే ఉంచింది. ఇప్పుడిప్పుడే టాలీవుడ్ పరిశ్రమ ఈ విపత్తు నుంచి తేరుకొని తిరిగి షూటింగ్స్ కు సన్నద్ధమవుతోంది. ఆల్రెడీ కొందరు చిన్న, పెద్ద హీరోలు .. తమ సినిమాల చిత్రీకరణను తిరిగి ప్రారంభించారు. కోవిడ్ నిబంధనలను తూచ తప్పకుండా పాటిస్తూ.. తగు జాగ్రత్తలతో షూటింగ్స్ ను జరుపుతున్నారు. అయితే కొందరు స్టార్ హీరోలు .. ఇంకా సెట్స్ మీదకు అడుగుపెట్టలేదు. అక్టోబర్ నుంచి చాలా మంది హీరోలు.. షూటింగ్స్ లో పాల్గొన బోతున్నారు. అందులో ముగ్గురు స్టార్ హీరోలు మెగా ఫ్యామిలీకి చెందినవారు కావడం ఆసక్తిని రేపుతోంది. వారు మరెవరో కాదు.. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.
ఆచార్య సినిమా షూటింగ్ రీస్టార్ట్ తో మెగాస్టార్
మెగాస్టార్ చిరంజీవి 152 వ సినిమా ‘ఆచార్య’ లాక్ డౌన్ కు ముందు లాంచ్ అయింది. కొంత భాగం చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా .. కరోనా కారణంగా షూటింగ్ కు బ్రేకిచ్చింది. 6 నెలల తర్వాత ఈ సినిమా తిరిగి చిత్రీకరణకు వెళ్ళబోతోంది. అక్టోబర్ రెండో వారంలో ‘ఆచార్య’ ఫ్రెష్ షెడ్యూల్ కు సిద్ధమవుతోంది. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా .. దేవాలయాల స్కామ్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఇందులో చిరు రెండు పాత్రల్ని పోషిస్తున్నాడని తెలుస్తోంది. అంతేకాదు రామ్ చరణ్ సైతం ఇందులో ఒక ప్రత్యేక పాత్ర పోషిస్తూండడం ఆసక్తిని రేపుతోంది. కాజల్ అగర్వాల్ కథానాయికగా, మణిశర్మ సంగీత సారధ్యంలో ఆచార్య సినిమా అభిమానులకు మాస్ ఫీస్ట్ ఇవ్వనుంది. అయితే ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుంది అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు.
‘వకీల్ సాబ్’ కోసం పవర్ స్టార్ కూడా అక్టోబర్ లోనే
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తో కమ్ బ్యాక్ అవుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ మూవీ ‘పింక్’ రీమేక్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి దర్శకుడు శ్రీరామ్ వేణు. ఈ సినిమా కూడా లాక్ డౌన్ కు ముందే లాంచ్ అయింది. ఆ తర్వాత కరోనా వైరస్ కారణంగా షూటింగ్ కు బ్రేక్ పడింది. ఈ సినిమా రీసెంట్ గా మళ్లీ చిత్రీకరణ ప్రారంభించింది కానీ.. పవన్ కళ్యాణ్ ఇంకా సెట్స్ లోకి రాలేదు. అక్టోబర్ నుంచి పవన్ డేట్స్ ఇచ్చాడట. శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తోన్న వకీల్ సాబ్ .. వచ్చే ఏడాది సంక్రాంతిని టార్గెట్ చేసుకుందని తెలుస్తోంది.
అక్టోబర్ లో తిరిగి సెట్స్ మీదకు వెళ్ళనున్న రామ్ చరణ్ ‘ఆర్.ఆర్.ఆర్’
ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ ఎవైటెడ్ మూవీస్ లో ‘ఆర్.ఆర్.ఆర్’ కూడా ఒకటి. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ క్రేజీ మల్టీస్టారర్ .. నిజానికి వచ్చే సంక్రాంతిని టార్గెట్ చేసుకుంది. రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ అయింది. అయితే.. ఈ సినిమా షూటింగ్ కు కరోనా వైరస్ అంతరాయం కలిగించింది. అందుకే ఈ సినిమా రిలీజ్ కు మరింత టైమ్ పట్టేలా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ ను తిరిగి అక్టోబర్ నుంచి ప్రారంభించాలని జక్కన్న ఈ సినిమా టీమ్ కు ఇన్ స్ట్రక్షన్స్ ఇచ్చాడట. ఆ మేరకు తారక్, చెర్రీ, హీరోయిన్ అలియా భట్ అక్టోబర్ నుంచి జరిగే షెడ్యూల్లో జాయిన్ అవుతున్నారట. సో.. మొత్తానికి ముగ్గురు మెగాహీరోల సినిమాల షూటింగ్స్ అక్టోబర్ లో మొదలు కానున్నాయి. మరి అభిమానులకు ఇంతకన్నా కావల్సిందేముంది?











