షార్జా వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్ జట్ల జరిగిన మ్యాచ్ లైవ్ చూడని వారు మజాను మిస్ అయ్యారు. ఏంటీ ఆ మజా తెలుసుకోవలాని ఉందా? ఈ కథనం చదివితే మీకే అర్ధమవుతోంది. టాస్ గెలిచికూడా రాజస్తాన్ కు బ్యాటింగ్ అప్పగించడం తప్పో? ధోనికి తెలిసివచ్చేలా రాజస్తాన్ ఆటగాళ్లు చేశారు. స్టీవ్ స్మిత్ క్లాస్ ఇన్నింగ్స్ కు సంజు శాంసన్ తుఫాన్ ఇన్నింగ్స్ తోడవడంతో చెన్నై బౌలర్లు గతి తప్పారు. బీసీసీఐ పెద్దలు,సెలెక్టర్లు ఐపీఎల్ మ్యాచును చూసేందుకు ప్రస్తుతం షార్జాలో ఉన్నారు. వారిని మెప్పించి టీమిండియాలో స్థానం దక్కించుకోవాలని అనుకున్నాడేమో? ఏమో? కానీ శాంసన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. తుఫాను ముందు ప్రశాంతత లాగా మొదట కొన్ని బాల్స్ ను శాంసన్ ఆచితూచి ఆడాడు. టైమింగ్ కుదిరాక ఒక్కసారిగా జూలు విదిల్చాడు.
చెన్నై స్పిన్నర్లు రవీంద్ర జడేజా, పీయూష్ చావ్లా బౌలింగ్ లో సిక్సర్లతో విరుచుకు పడ్డారు. బౌలర్ చేతి నుంచి డెలివరీ కావడం ఆలస్యం బాల్ గ్యాలరీలో కనబడాలి అనే ఉద్దేశంతో ఈ ఇన్నింగ్స్ ఆడినట్లు ఉంది. 4 ఓవర్లు ముగిసే సరికి 3 పరుగుల వద్ద ఉన్న శాంసన్ ఆ తరువాత గేర్ మార్చాడు. ఈ క్రమంలో శాంసన్ కేవలం 19 బాల్స్ లోనే హాఫ్ సెంచరీ చేశాడు. దీంతో శాంసన్ ఓ రికార్డు నెలకొల్పాడు. 19 బాల్స్ లోనే హాఫ్ సెంచరీ చేసిన డేవిడ్ మిల్లర్ రికార్డును అతను సమం చేశాడు.
ఫాస్టెస్ట్ ఐపీఎల్ ఫిఫ్టీస్
1) డేవిడ్ మిల్లర్ (పంజాబ్)-19 బాల్స్ (2014)
2) సంజు శాంసన్ (రాజస్తాన్)-19 బాల్స్ (2020)
3) స్టోనిక్స్ (ఢిల్లీ)- 20 బాల్స్ (2020)
4) మాక్స్వెల్ (పంజాబ్)- 21 బాల్స్ (2014)
5) మాక్స్వెల్ (పంజాబ్)-25 బాల్స్ (2014)
శాంసన్ దూకుడుగా ఆడుతున్న సమయంలో స్ట్రైక్ రొటేట్ చేస్తూ స్టీవ్ స్మిత్ మంచి సపోర్ట్ ఇచ్చాడు. శాంసన్ పెవిలియన్ చేరగానే ఆ బాధ్యత తీసుకొని చెలరేగిపోయాడు. జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించాడు. శాంసన్, స్మిత్ ఔట్ అయిన తరువాత రాజస్తాన్ మిడిల్ ఆర్డర్ తడబడింది. వరుసగా వికెట్లు కోల్పోవడంతో రాజస్తాన్ స్కోరు 200 పరుగుల మార్క్ దాటదని అభిమానులు భావించారు. వారి అంచనాలను తలకిందులు చేస్తూ ఆర్చర్ చెన్నై బౌలర్ ఎంగిడికి చుక్కులు చూపించాడు. చివరి ఓవర్ లో వరుసగా నాలుగు సిక్సర్లు కొట్టిన ఆర్చర్ జట్టుకు భారీ స్కోరు అందించాడు. ఈ మ్యాచ్ లో రాజస్తాన్ జట్టు 17 సిక్సర్లు కొట్టడం విశేషం. శాంసన్ (9 సిక్సర్లు), స్మిత్(4), ఆర్చర్(4) సిక్సర్లు కొట్టారు.
ఛేజింగ్ లో చెన్నై రెగ్యులర్ గా వికెట్లు నష్టపోవడంతో లక్ష్యానికి 16 పరుగుల దూరంలో నిలిచింది. చెన్నై జట్టు ఆటగాళ్లు కూడా 16 సిక్సర్లు కొట్టడం విశేషం. వాట్సన్(4), సామ్ కరణ్(2), డుప్లిసిస్(7), ధోని (3) సిక్సర్లు కొట్టారు. మొత్తం ఈ మ్యాచ్ లో 33 సిక్సర్లు నమోదు కావడం గమనార్హం. అత్యధికంగా సిక్సర్లు నమోదయిన మ్యాచ్ గా ఓ రికార్డు నెలకొల్పింది.
ఆర్సీబీ vs సీఎస్కే (2018)-33 సిక్సర్లు
ఆర్ఆర్ vs సీఎస్కే (2020)-33 సిక్సర్లు
కేకేఆర్ vs సీఎస్కే (2018)- 31 సిక్సర్లు
పంజాబ్ vs కేకేఆర్ (2018)- 31 సిక్సర్లు
డీడీ vs గుజరాత్ లయన్స్ (2017)-31 సిక్సర్లు










